Home
Mobile

ధర రూ.9999 కే 50MP కెమెరా, 128GB స్టోరేజీ, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. సేల్‌ ప్రారంభం..!

మోటోరోలా నుంచి భారత్‌ మార్కెట్‌లోకి మోటో G35 5G స్మార్ట్‌ఫోన్‌ (Moto G35 5G Smartphone Sale) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ రూ.10,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం అయింది. మోటో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ సహా ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. మరియు వేగాన్‌ లెదర్‌ డిజైన్‌ను కలిగి ఉంది.

మోటో G35 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ధర ప్రస్తుతం రూ.9,999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. మిడ్‌నైట్‌ బ్లాక్‌, లీఫ్‌ గ్రీన్‌, గువా రెడ్‌ రంగుల్లో లభిస్తుంది.

Moto G35 5G Smartphone sale is live

మోటో G35 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
మోటో G35 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI తో పనిచేస్తుంది. మరియు Unisoc T760 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 4GB LPDDR4X ర్యామ్‌ మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది.

మోటో G35 5G హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ 3 రక్షణను కలిగి ఉంది. నైట్‌ విజన్‌ మోడ్‌, విజన్‌ బూస్టర్‌ వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.

Moto G35 5G Smartphone sale is live

భారత్‌ మార్కెట్‌ లో కేవలం 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ లో మాత్రమే కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. మరియు ఈ మోటో 5G కొత్త స్మార్ట్‌ఫోన్‌ 20W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను అమర్చారు. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ సెకండరీ కెమెరాను కలిగి ఉంది. ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ IP52 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను అమర్చారు.

Moto G35 5G Smartphone sale is live

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌ 5G ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు Wi-Fi, బ్లూటూత్‌ 5.0, USB-C ఛార్జింగ్ పోర్టు, GPS వంటి అనేక కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. వీటితోపాటు అనేక సెన్సార్‌లను కూడా ఈ హ్యాండ్‌సెట్‌కు అమర్చారు. యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ, గైరోస్కోప్‌. SAR సెన్సార్‌, ఇ-కంపాస్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G35 5G Smartphone sale is live in india check features and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X