ధర రూ.9,999 కే 128GB స్టోరేజీ, 50MP కెమెరా, 6.72 అంగుళాల FHD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి మోటో G35 5G స్మార్ట్‌ఫోన్ (Moto G35 5G Smartphone) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ యూరోపియన్ మార్కెట్‌లలో ఈ సంవత్సరం ఆగస్టులోనే అందుబాటులోకి వచ్చింది. భారత్ మార్కెట్‌లో రూ.10,000 కంటే తక్కువ ధరకే లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 6.72 అంగుళాల పుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు 50MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులో ఉంది. డిసెంబర్ 16 నుంచి సేల్ ప్రారంభం కానుంది.
మోటో G35 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
మోటో G35 5G స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు గొరెల్లా గ్లాస్ 3 రక్షణను పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే నైట్ విజన్ మోడ్, విజన్ బూస్టర్ వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. మరియు వేగాన్ లెదర్ డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు Unisoc T760 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 4GB LPDDR4x ర్యామ్ మరియు 128GB UFS 2.2 అంతర్గత స్టోరేజీతో జతచేసి ఉంది.
సింగిల్ స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులోకి :
మోటో G35 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI (స్కిన్ ఆన్ టాప్) ను కలిగి ఉంది. భారత్ మార్కెట్‌లో ఈ మోటో కొత్త 5G హ్యాండ్‌సెట్ కేవలం 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 20W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
మోటో G35 స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వైఫై, GPS, USB-C వంటి అనేక కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు ప్రాక్సిమిటీ, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్. SAR సెన్సార్, ఇ-కంపాస్ వంటి సెన్సార్‌తో విడుదల అయింది.
మోటో G35 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
మోటో G35 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను మోటోరోలా ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం మిడ్‌నైట్ బ్లాక్, లీఫ్ గ్రీన్, Guava రెడ్ రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








