మోటో జీ4 పై రూ.2,000 తగ్గింపు

అమెజాన్ ఇండియాలో విక్రయించబడుతోన్న మోటో జీ4, మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్‌ల ధరలను లెనోవో తగ్గించింది. 16జీబి అలానే 32జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యమవుతోన్న మోటో జీ4 ఫోన్‌ను ఇక పై రూ.2,000 తగ్గింపుతో పొందవచ్చు. మరోవైపు మోటో జీ4 ప్లే కొనుగోలు పై రూ.1000 క్యాష్ బ్యాక్ మీకు లభిస్తుంది. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో 16జీబి వర్షన్ మోటో జీ4 స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,499కు, 32జీబి వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,999కే పొందవచ్చు.

Read More : క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు అవసరం లేదు.. ఆధార్ ఉంటే చాలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్..

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్, 401 పీపీఐ. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 617 చిప్‌సెట్‌. ఈ చిప్‌సెట్‌కు అనుసంధానించిన అడ్రినో 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ విభాగానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్..

2జీబి ర్యామ్‌తో , 16జీబి, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.డ్యుయల్ టోన్ ఫ్లాష్, ఎఫ్/2.0 అపెర్చుర్, 84 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరాలలో ఉన్నాయి

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్..

4జీ ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో. మోటో జీ4 స్మార్ట్‌ఫోన్, టర్బో ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. టర్బో ఛార్జర్ ద్వారా ఫోన్‌ను 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు 6 గంటల యూసేజ్ టైమ్‌ లభిస్తుంది. మోటో జీ4 స్మార్ట్‌ఫోన్ బరువు ఇంచుమించుగా 157 గ్రాములు ఉంటుంది. మందం 7.9 మిల్లీ మీటర్లు.

 

Moto G4 Play ప్లస్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1280× 720పిక్సల్స్, 294 పీపీఐ), ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో 6.0.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

Moto G4 Play ప్లస్ స్పెసిఫికేషన్స్

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎఫ్/2.2 అపెర్చుర్, ఎల్ఈడి ఫ్లాష్, 4ఎక్స్ డిజిటల్ జూమ్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, 2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్. స్వల్ప నీటి ప్రమాదాలను తట్టుకునేలా నానో కోటింగ్ పొరతో వస్తోన్న మోటో జీ4 ప్లే ఫోన్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ వంటి
స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను ఈ డివైస్‌లో పొందుపరిచారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G4 Available With Rs. 2,000 Discount, Moto G4 Play Gets Rs. 1,000 Cashback on Amazon India. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting