మార్కెట్లోకి మోటో జీ4, జీ4 ప్లస్

Written By:

భారీ అంచనాల మధ్య మోటో జీ4, మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. మోటో జీ4 ప్లస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. ధర రూ.13,499. ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. ధర రూ.14,999.

మార్కెట్లోకి మోటో జీ4, జీ4 ప్లస్

నేటి అర్థరాత్రి నుంచి Amazon.in ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. మోటో జీ4 ధర ఇంకా అందుబాటు వివరాలను కంపెనీ వెల్లడించలేదు. సేల్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన స్సెసిఫికేషన్‌లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : రీసెంట్‌గా విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ జే7 రూ.2,989కే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లోకి మోటో జీ4, జీ4 ప్లస్

డిస్‌ప్లే విషయానికొస్తే మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్, 401 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, నానో కోటింగ్.

మార్కెట్లోకి మోటో జీ4, జీ4 ప్లస్

మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సీపీయూతో వస్తున్నాయి. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే.. మోటో జీ4 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

మోటో జీ4 ప్లస్ మోటో జీ4 ప్లస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. ధర రూ.13,499. ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

మార్కెట్లోకి మోటో జీ4, జీ4 ప్లస్

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్‌ 13 మెగా పిక్సల్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ రేర్ ఫేసంగ్ కెమెరాతో వస్తుండగా, మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. (కెమెరా ప్రత్యేకతలు: (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్). ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తున్నాయి.

మార్కెట్లోకి మోటో జీ4, జీ4 ప్లస్

మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన టర్బో ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తున్నాయి. టర్బో ఛార్జర్ ద్వారా ఫోన్‌లను 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు 6 గంటల యూసేజ్ టైమ్‌ను పొందవచ్చు. 

 

మార్కెట్లోకి మోటో జీ4, జీ4 ప్లస్

మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు డ్యుయల్ సిమ్ స్టాండ్ బై ఆన్ 4జీ అండ్ 3జీ, VoLTE,వై-ఫై, బ్లుటూత్ 4.1, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను పొందుపరిచారు. 

మార్కెట్లోకి మోటో జీ4, జీ4 ప్లస్

మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 6.0.2 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

మార్కెట్లోకి మోటో జీ4, జీ4 ప్లస్

మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది. ఫోన్ హోమ్ బటన్ భాగంలో ఏర్పాటు చేసిన ఈ స్కానర్ వ్యవస్థ ద్వారా ఫోన్ ను 750 మిల్లీసెకన్ల వ్యవధిలో అన్‌లాక్ చేయవచ్చు. 5 ఫింగర్ ప్రింట్స్ స్టోర్ చేసుకునే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Moto G4 and G4 Plus Goes Official in India, Starting at Rs 13,499. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot