మే 17న Moto G4, అమెజాన్‌లో మాత్రమే

By Sivanjaneyulu
|

మోటరోలా అప్ కమింగ్ ఫోన్ మోటో జీ4 (Moto G4), మే 17న ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా Amazonలో మాత్రమే విక్రయించనున్నట్లు మోటో ఇండియా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది. మోటో జీ సిరీస్ నుంచి వస్తోన్న ఈ ఫోర్త్ జనరేషన్ డివైస్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఇంకా బెటర్ బ్యాటరీ లైఫ్ వంటి అత్యాధునిక ఫీచర్లను పొందుపరేచే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మే 17న Moto G4, అమెజాన్‌లో మాత్రమే

వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న లీక్స్ ప్రకారం మోటో జీ4 రెండు వేరియంట్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అందులో మొదటిది రెగ్యులర్ జీ4 వర్సన్ కాగా, రెండవది జీ4 టర్బో ఎడిషన్. మోటో ఇండియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెలువడుతోన్న సమాచారం ప్రకారం మోటో జీ4.. బిగ్గర్ బ్యాటరీ అలానే మెరుగుపరచబడిన కెమెరా క్వాలిటీతో రాబోతోంది. మోటో బై లెనోవో బ్రాండింగ్‌తో రాబోతున్న మోటో జీ4కు సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Read More : రూ.9,999కే 'విండోస్ 10' ల్యాప్‌టాప్

ఇప్పటికే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న యూజర్లకు  బెస్ట్ టిప్స్

ఇప్పటికే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న యూజర్లకు బెస్ట్ టిప్స్

మీ మోటో జీ ఫోన్‌లోని బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవటానికి ఎక్కువ సమయం తీసకుంటుందా..? అయితే ఇది హార్డ్‌వేర్ సమస్యే, చార్జర్‌కు సంబంధించిన యూఎస్బీ కేబుల్‌ను మార్చటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

ఇప్పటికే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న యూజర్లకు  బెస్ట్ టిప్స్

ఇప్పటికే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న యూజర్లకు బెస్ట్ టిప్స్

మీ మోటో జీ ఫోన్ సిమ్‌కార్డ్‌ను గుర్తించటం లేదా..? ఈ సమస్య పరిష్కారం పై మోటరోలా ఇప్పటికే పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. మీ ప్రయత్నంగా, వేరే సిమ్‌లను వేసి ప్రయత్నించిండి. ఒకవేళ సమస్య మీ సిమ్ కార్డ్‌లో ఉంటే పరిష్కరించుకోవచ్చు. మీరు అడాప్టర్‌తో కూడిన మైక్రోసిమ్‌ను వినియోగిస్తున్నట్లయితే నానో సిమ్‌గా మార్చి ప్రయత్నించండి. ఈ పోన్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ వర్షన్ పై రన్ అవుతున్నట్లయితే సమస్య పరిష్కారమయ్యేంత వరకు 3జీ, 2జీ డేటా కనెక్షన్‌లను ఆఫ్ చేసి ఉంచండి.

ఇప్పటికే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న యూజర్లకు  బెస్ట్ టిప్స్

ఇప్పటికే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న యూజర్లకు బెస్ట్ టిప్స్

మీ మోటో జీ ఫోన్‌లో కెమెరా యాప్ స్పందించటం లేదా..? అయితే, ముందుగా సెట్టింగ్స్‌లోని యాప్స్ మెనూలోకి ప్రవేశించి కెమెరా యాప్‌ను సెలక్ట్ చేసుకోండి. కెమెరా యాప్ ఓపెన్ అయిన తరువాత ‘Force stop' ‘clear data', ‘clear cache' ఆప్షన్‌లను ‘Apply' చేయండి. చాట్ మెసెంజర్స్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి కెమెరాను యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసే ముందు ఓసారి వాటిని తొలగించి చూడండి. సమస్యకు పరిష్కారం లభించవచ్చు.

ఇప్పటికే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న యూజర్లకు  బెస్ట్ టిప్స్

ఇప్పటికే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న యూజర్లకు బెస్ట్ టిప్స్

మీ మోటో జీ ఫోన్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు ఫోన్‌లోని మోటరోలా డివైస్ ఐడీ సిస్టం, గూగుల్ అండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఫీచర్లను తప్పనిసరిగా యాక్టివేట్ చేసకోవాలి. డివైస్ సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా ఈ ఫీచర్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఇప్పటికే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న యూజర్లకు  బెస్ట్ టిప్స్

ఇప్పటికే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న యూజర్లకు బెస్ట్ టిప్స్

 మీ మోటో జీ ఫోన్‌లో స్ర్కీన్ షాట్ తీసుకోవాలంటే వాల్యుమ్ డౌన్ బటన్‌తో పవర్ బటన్‌ను ఒకే సారి ప్రెస్‌చేస్తే చాలు.

ఇప్పటికే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న యూజర్లకు  బెస్ట్ టిప్స్

ఇప్పటికే మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న యూజర్లకు బెస్ట్ టిప్స్

మీ మోటో జీ ఫోన్‌లోని బ్యాటరీ పర్సెంటేజ్ ఒక సంఖ్య నుంచి మరొక సంఖ్యకు హఠాత్తుగా మారిపోతుందా..? ఈ విధమైన సమస్య మీ మోటో జీ ఫోన్‌కు ఎదురైనట్లయితే, ముందుగా ఫోన్ బ్యాటరీ స్థాయిని సున్నాకి తీసుకురండి. ఆ తరువాత ‘0' నుంచి ‘100' శాతం వరకు పూర్తిగా చార్జ్ చేయండి. ఈ పద్ధతిని అలవాటు చేయటం ద్వారా బ్యాటరీ ఓ క్రమ పద్ధతిని అలవర్చుకుంటుంది. అలానే మీ ఫోన్‌లో బ్యాటరీకి సంబంధించి థర్డ్ పార్టీ యాప్స్ ఏవైనా ఇన్‌స్టాల్ చేసి ఉంటే వాటిని తొలగించండి. సమస్యకు అవికూడా కారణమై ఉండొచ్చు.

Best Mobiles in India

English summary
Moto G4 launch confirmed for May 17, Amazon exclusive. Read More in Telugu Gibzot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X