మోటో జీ4 ప్లస్ ఇప్పుడు రూ.12,499కే

క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇండియా.. మోటో జీ4, మోటో జీ4 ప్లస్, మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.2,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్లను ప్రకటించింది.

మోటో జీ4 ప్లస్ ఇప్పుడు రూ.12,499కే

Read More : నోకియా నుంచి మరో సంచలన ఫోన్..?

అంతేకాకుండా, ఆసక్తికర ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను కూడా ఈ ఫోన్‌ల పై లాంచ్ చేసింది. ఈ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ డిసెంబర్ 20 నుంచి జనవరి మధ్య వరకు అందుబాటులో ఉంటుందని అమెజాన్ ఇండియా ప్రకటించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 శాతం అదనపు క్యాష్ బ్యాక్

ఈ ఫోన్‌లను స్టాండర్డ్ చాటర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేయటం ద్వారా 10 శాతం అదనపు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అదేవిధంగా, నెట్ బ్యాంకింగ్ అలానే ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆప్షన్‌లను ఉపయోగించి ఈ ఫోన్‌లను కొనుగోలు చేయటం ద్వారా అమెజాన్ గిఫ్ట్ కార్డ్ రూపంలో రూ.1000 క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేయటం జరుగుతుంది

ఎక్స్‌ఛేంజ్ సదుపాయం కూడా..

స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.14,000 వరకు తగ్గింపు

కండీషన్‌లో ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌లతో ఈ కొత్త ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకునే అవకాశాన్నికూడా అమెజాన్ ఇండియా కల్పిస్తోంది. ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.10,035 వరకు మీకు ఎక్స్‌ఛేంజ్ రూపంలో లభించే అవకాశం ఉంది.

EMI సదుపాయం..

ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, హెచ్ఎస్‌బీఎస్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ అలానే స్టాండర్డ్ చాటర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈ ఫోన్‌లను EMI సదుపాయం పై సొంతం చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోటో జీ4 ధర తగ్గింపు తరువాత

క్రిస్మస్, న్యూఇయర్ డిస్కౌంట్స్ పై 10 స్మార్ట్‌‍ఫోన్‌లు

మోటో జీ4 (16జీబి వర్షన్) ధర గతంలో రూ.12,499గా ఉండేది. తాజా డిస్కౌంట్‌లో భాగంగా రూ.10,499కే అమెజాన్ ఇండియాలో ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో మెటోజీ 4 (32జీబి వర్షన్) ధర గతంలో రూ.13,499గా ఉండేది. తాజా, ధర తగ్గింపులో భాగంగా రూ.11,999కే అమెజాన్ ఇండియాలో ట్రేడ్ అవుతోంది.

మోటో జీ4 ప్లస్ ధర తగ్గింపు తరువాత

మోటో జీ4 ప్లస్ విషయానికి వచ్చేసరికి.. 16జీబి వర్షన్ ధర గతంలో రూ.13,499గా ఉండేది. తాజా డిస్కౌంట్‌లో భాగంగా రూ.12,499కే అమెజాన్ ఇండియాలో ట్రేడ్ అవుతోంది. 16జీబి వర్షన్ ధర గతంలో రూ.14,999గా ఉండేది. తాజా డిస్కౌంట్‌లో భాగంగా రూ.13,999కే అమెజాన్ ఇండియాలో ట్రేడ్ అవుతోంది.

మోటో జీ4 ప్లే ధర తగ్గింపు తరువాత

మీ ఫోన్‌ను అనేక రకాలుగా టెస్ట్ చేయాలనుకుంటున్నారా?

మోటో జీ4 ప్లే ధర గతంలో రూ.8,999గా ఉండేది. తాజా ధర తగ్దింపులో భాగంగా రూ.8,499కే మీ సొంత మవుతుంది.

మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు

 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్, 401 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, నానో కోటింగ్. మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సీపీయూతో వస్తున్నాయి. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే.. మోటో జీ4 2జీబి ర్యామ్, 16జీబి, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

మోటో జీ4 ప్లస్ రెండు వేరియంట్‌లలో..

మోటో జీ4 ప్లస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది.ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సీపీయూతో వస్తున్నాయి. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే.. మోటో జీ4 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

4జీ వోల్ట్ సపోర్ట్

మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు డ్యుయల్ సిమ్ స్టాండ్ బై ఆన్ 4జీ అండ్ 3జీ, VoLTE,వై-ఫై, బ్లుటూత్ 4.1, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను పొందుపరిచారు.

Moto G4 Play ప్లస్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1280× 720పిక్సల్స్, 294 పీపీఐ), ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో 6.0.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎఫ్/2.2 అపెర్చుర్, ఎల్ఈడి ఫ్లాష్, 4ఎక్స్ డిజిటల్ జూమ్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, 800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్. స్వల్ప నీటి ప్రమాదాలను తట్టుకునేలా నానో కోటింగ్ పొరతో వస్తోన్న మోటో జీ4 ప్లే ఫోన్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G4, Moto G4 Plus, Moto G4 Play get up to Rs 2,000 off on Amazon India.Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot