మోటో నుంచి మరో సంచలనాత్మక ఫోన్, రూ.8,999కే?
లెనోవో నేతృత్వంలోని మోటరోలా నుంచి భారీ కాంపిటీషన్ మధ్య ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన మోటో జీ4 ప్లస్, మోటో జీ4 స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో మోటరోలాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ప్రముఖ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Zauba, మోటరోలా అప్‌కమింగ్ పోన్ Moto G4 Play?కు సంబంధించి ఆసక్తి వివరాలను బహిర్గతం చేసింది. ఈ వెబ్‌సైట్ డేటా లిస్టింగ్స్ ప్రకారం మోటో జీ4 ప్లే ఫోన్ మోడల్ నెంబర్ XT 1607తో రాబోతోంది. యూఎస్ నుంచి ఈ ఫోన్ ను ఇంపోర్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.8,999. మోటో జీ4 ప్లే ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి...
Read More : ఓటరు ఐడీతో ఆధార్ లింక్ చేయడం ఎలా..?

మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ - డిస్‌ప్లే
5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ డిస్‌ప్లే,

మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ - ప్రాసెసర్
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 306 గ్రాఫిక్స్,

మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ - స్టోరేజ్
రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఒకటి 8జీబి, మరొకటి 16జీబి. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ - కెమెరా
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్, ఎఫ్/2.2 అపెర్చుర్, హెచ్‌డీఆర్, బరస్ట్ మోడ్, పానోరమా), 5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా.

మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ - కనెక్టువిటీ ఆప్షన్స్
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్, డ్యుయల్ సిమ్ సపోర్ట్.

మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ - వాటర్ రెసిస్టెంట్
మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్‌తో వస్తోంది. ఈ ఫీచర్ పోన్‌ను నీటి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.

మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ - బ్యాటరీ
మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.


Click it and Unblock the Notifications








