మోటో జీ4 ప్లే వచ్చేసింది, రూ.8,999కే

లెనోవో నేతృత్వంలోని మోటరోలా తన Moto G4 Play స్మార్ట్‌ఫోన్‌‌ను మంగళవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.8,999. నేటి రాత్రి నుంచి Amazon Indiaలో అమ్మకాలు జరుగుతాయి.

 మోటో జీ4 ప్లే వచ్చేసింది, రూ.8,999కే

Read More : ఈ నెలలో కొత్త ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి 20 ఆప్షన్స్

మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు టోనుడ్ డౌన్ వర్షన్‌గా వచ్చిన జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న రెడ్మీ 3ఎస్ ప్రైమ్, హానర్ హోళీ 2 ప్లస్ వంటి ఫోన్‌లకు ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Moto G4 Play ప్లస్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1280× 720పిక్సల్స్, 294 పీపీఐ), ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో 6.0.1 ఆపరేటింగ్ సిస్టం,

#1

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

#2

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

 

#3

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎఫ్/2.2 అపెర్చుర్, ఎల్ఈడి ఫ్లాష్, 4ఎక్స్ డిజిటల్ జూమ్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా,

 

#4

2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్.

#5

స్వల్ప నీటి ప్రమాదాలను తట్టుకునేలా నానో కోటింగ్ పొరతో వస్తోన్న మోటో జీ4 ప్లే ఫోన్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది.

#6

డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను ఈ డివైస్‌లో పొందుపరిచారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G4 Play launched in India, priced at Rs 8,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot