మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

Written By:

భారీ అంచనాల మధ్య మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బంపర్ మెజారిటీ అమ్మకాలతో దూసుకుపోతున్న షియోమీ రెడ్మీ నోట్ 3, లీఇకో 1ఎస్‌లకు ధీటైన ప్రత్యర్థిగా బరిలోకి దిగిన ఈ మోటరోలా బ్లాక్‌బస్టర్ అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా ట్రేడ్ అవుతోంది.

 మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

మార్కెట్లో మోటో జీ4 ప్లస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. ధర రూ.13,499. ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. ధర రూ.14,999. ముఖ్యమైన డిజైనింగ్ మార్పులతో బరిలోకి దిగిన మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌‌కు సంబంధించి 5 నచ్చే అంశాలతో పాటు 5 నిరుత్సహపరిచే అంశాలను పాఠకుల దృష్టికి తీసుకురావటం జరుగుతోంది....

Read More : 2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌‌లోని ఆకట్టుకునే అంశాలలో హై డిస్‌ప్లే రిసల్యూషన్ ఒకటి. 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్‌ను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ లో ఏర్పాటు చేసిన స్ర్కీన్ వ్యవస్థ క్రిస్ప్, వైబ్రెంట్ ఇంకా అత్యుత్తమ వ్యూవింగ్ యాంగిల్స్ ను కలిగి ఉంటుంది.

 

మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌‌లోని మరో ఆకట్టుకునే ఫీచర్ ‘ఫింగర్‌ప్రింట్ సెక్యూరిటీ'.ఫోన్ హోమ్ బటన్ భాగంలో ఏర్పాటు చేసిన ఈ స్కానర్ వ్యవస్థ ద్వారా ఫోన్ ను 750 మిల్లీసెకన్ల వ్యవధిలో అన్‌లాక్ చేయవచ్చు. 5 ఫింగర్ ప్రింట్స్ స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

 

మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌‌లోని మరో ఆకట్టుకునే ఫీచర్ కెమెరా. 16 మెగా పిక్సల్ శక్తివంతైన కెమెరాను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసారు. ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్, ప్రొఫెషనల్ మోడ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

 

మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌‌లోని మరో ఆకట్టుకునే ఫీచర్ ‘హార్డ్‌వేర్'. స్నాప్ డ్రాగన్ 617 ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ను (2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ), (3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ) వేరియంట్‌లలో మోటారోలా అందుబాటులో ఉంచింది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. ఇక బ్యాటరీ విషయానికొస్తే జీ4 ప్లస్ ఫోన్‌లో టర్బో ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన శక్తివంతమైన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేసారు. టర్బో ఛార్జింగ్ ఫీచర్ ద్వారా ఫోన్‌ను 15 నిమిషాలు ఛార్జ్ చేసినట్లయితే 6 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు.

 

మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

ముఖ్యమైన డిజైనింగ్ మార్పులతో బరిలోకి దిగిన మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ 7.9 మిల్లీ మీటర్ల మందంతో స్లిమ్ లుక్‌ను కలిగి ఉంటుంది.

మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

ఫోన్ ఫ్రంట్ కెమెరాలో ఫ్లాష్ లైట్ సదుపాయం లేదు.

మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

మోటో జీ3 మాదిరిగా మోటో జీ4 ప్లస్ వాటర్ ఫ్రెండ్లీ కాదు. నీటిలో పడితే ఫోన్ ధ్వంసం కాక తప్పదు.

మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌‌లో యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ లేదు.

మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

ముఖ్యమైన డిజైనింగ్ మార్పులతో బరిలోకి దిగిన మోటో జీ4 ప్లస్ స్మార్ట్ ఫోన్ హోమ్ బటన్ ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి..

మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్, 401 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, నానో కోటింగ్. 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సీపీయూ, రెండు వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. ధర రూ.13,499. ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. (కెమెరా ప్రత్యేకతలు: (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్). 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. శక్తివంతమైన టర్బో ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు 6 గంటల యూసేజ్ టైమ్‌ను పొందవచ్చు. సిమ్ స్టాండ్ బై ఆన్ 4జీ అండ్ 3జీ, VoLTE,వై-ఫై, బ్లుటూత్ 4.1, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 6.0.2 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది. ఫోన్ హోమ్ బటన్ భాగంలో ఏర్పాటు చేసిన ఈ స్కానర్ వ్యవస్థ ద్వారా ఫోన్ ను 750 మిల్లీసెకన్ల వ్యవధిలో అన్‌లాక్ చేయవచ్చు. 5 ఫింగర్ ప్రింట్స్ స్టోర్ చేసుకునే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G4 Plus [First impressions]: 5 things we love and 5 we wish to change!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot