మోటో జీ4 ప్లస్ vs షియోమీ రెడ్మీ నోట్ 3

Written By:

ఫీల్ గుడ్ ఫీచర్లతో మోటో జీ4 ప్లస్ మార్కెట్లోకి దిగేసేంది. బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తీవ్రమైన పోటీకి తెరలేపిన జీ4 ప్లస్ రూ.15,000 ధర రేంజ్‌లో ప్రస్తుతం నెం.1గా కొనసాగుతోంది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మోటరోలా ఫోన్‌‍లకు తీవ్రమైన పోటీనిస్తోన్న బ్రాండ్‌లలో షియోమీ ఒకటి.

మోటో జీ4 ప్లస్ vs షియోమీ రెడ్మీ నోట్ 3

ఈ బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో విడుదలైన రెడ్మీ నోట్ 3 అమ్మకాల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. 60 రోజుల వీక్లీ సేల్స్‌లో భాగంగా 6 లక్షల రెడ్మీ నోట్ 3 యూనిట్‌లను తాము భారత్‌లో విక్రయించగలిగినట్లు షియోమీ వైస్ ప్రెసిడెంట్ Hugo Barra కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. స్పెసిఫికేషన్‌ల పరంగా చూస్తే మోటో జీ4 ప్లస్, రెడ్మీ నోట్ 3 ఫోన్‌లు హోరా హోరీగా తలపడుతున్నాయి. ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన spec comparisonను ఇప్పుడు చూద్దాం...

Read More : రూ.10,000 రేంజ్‌లో బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ4 ప్లస్ vs షియోమీ రెడ్మీ నోట్ 3

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి డిజైన్ విషయానికొస్తే వేరువేరు తీరుతెన్నులను కలిగి ఉంటాయి. మోటో జీ4 ప్లస్ స్లిమ్ ఫిట్ ఇంకా తక్కువ బరువుతో వస్తోంది. రబ్బర్ ఉపరితలంతో కూడిన ఫోన్ బ్యాక్ ప్యానల్ చేతికి బెటర్ గ్రిప్‌ను అందిస్తుంది. మరోవైపు, షియోమీ రెడ్మీ నోట్ 3 మంచి నాణ్యతతో కూడిన పూర్తి మెటాలిక్ బిల్డ్‌తో వస్తోంది. మోటో జీ4 ప్లస్‌లో కేవలం మెటాలిక్ ఫ్రేమ్‌ను మాత్రమే మనం చూడగలుగుతాం.

 

మోటో జీ4 ప్లస్ vs షియోమీ రెడ్మీ నోట్ 3

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి డిస్‌ప్లే వ్యవస్థను పరిశీలించినట్లయితే... స్ర్కాచ్ ప్రొటెక్షన్‌తో కూడిన 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే వ్యవస్థను ఈ రెండు డివైస్‌లలో మనం చూడొచ్చు. రెడ్మీ నోట్ 3 ఏర్పాటు చేసిన సన్‌లైట్ డిస్‌ప్లే హార్డ్‌వేర్ ఫీచర్ మోటో జీ4 ప్లస్ కంటే బాగుంటుంది. ఈ సరికొత్త హార్డ్‌వేర్ లెవల్ టెక్నాలజీ ద్వారా పిక్సల్‌కు సంబంధించిన కాంట్రాస్ట్‌ను రియల్ టైమ్‌లో అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

 

మోటో జీ4 ప్లస్ vs షియోమీ రెడ్మీ నోట్ 3

మోటో జీ4 ప్లస్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 617 SoCతో కూడిన మిడ్ రేంజ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. మరోవైపు రెడ్మీ నోట్ 3 హెక్సా కోర్ స్నాప్‌డ్రాగన్ 801 SoCను ఏర్పాటు చేసారు.

 

మోటో జీ4 ప్లస్ vs షియోమీ రెడ్మీ నోట్ 3

ఈ రెండు ఫోన్‌లు 2జీబి అలానే 3జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. 2జీబి ర్యామ్ వేరియంట్ 16 జీబి ఇంటర్నల్ మెమరీతో, 3జీబి ర్యామ్ వేరియంట్ 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని పెంచుకునే వీలు కూడా ఈ రెండు ఫోన్‌లలో కల్పించారు.

మోటో జీ4 ప్లస్ vs షియోమీ రెడ్మీ నోట్ 3

మోటో జీ4 ప్లస్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. మరోవైపు రెడ్మీ నోట్ 3 ఆండ్రాయిడ్ ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది.

 

మోటో జీ4 ప్లస్ vs షియోమీ రెడ్మీ నోట్ 3

ఈ రెండు ఫోన్‌లలో 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలను మనం చూడొచ్చు.

 

మోటో జీ4 ప్లస్ vs షియోమీ రెడ్మీ నోట్ 3

మోటో జీ4 ప్లస్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉండగా, రెడ్మీ నోట్ 3 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంది. ఈ రెండు నాన్ రిమూవబుల్ బ్యాటరీలు సింగిల్ ఛార్జ్ పై రోజు కంటే ఎక్కువ బ్యాకప్‌ను అందిస్తాయి.

 

మోటో జీ4 ప్లస్ vs షియోమీ రెడ్మీ నోట్ 3

మోటో జీ4 ప్లస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. ధర రూ.13,499. ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. ధర రూ.14,999. రెడ్మీ నోట్ 3 16జీబి వేరియంట్ ధర రూ.9,999. 32జీబి వేరియంట్ ధర రూ.11,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G4 Plus vs Xiaomi Redmi Note 3: Battle of the mid-range 4G smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot