ధర రూ.11,999 కే 8GB ర్యామ్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్..!
మోటోరోలా గత సంవత్సరం ఆగస్టులో మోటో G45 5G స్మార్ట్‌ఫోన్‌లు (Moto G45 5G Smartphone) విడుదల చేసింది. ఈ ఫోన్ సుమారు రూ.10 వేల ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
రూ.1000 డిస్కౌంట్ :
మోటో G45 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 8GB ర్యామ్ వేరియంట్‌పై రూ.1000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

5 శాతం క్యాష్‌బ్యా్క్ :
ఫలితంగా 8GB ర్యామ్ వేరియంట్‌ను రూ.11,999 కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. ఈ ఫోన్ బ్రిలియంట్ గ్రీన్, బ్రిలియంట్ బ్లూ, వివా మెజెంటా రంగుల్లో లభిస్తుంది.
మోటో G85 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
మోటో G85 5G స్మార్ట్‌ఫోన్ 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 269ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం గొరెల్లా గ్లాస్ 3 అందుబాటులో ఉంది.
చిప్‌సెట్, OS వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్ తో పనిచేస్తోంది. 8GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీ UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌తోపాటు మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందవచ్చు.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP కెమెరాను అమర్చారు. మరియు LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
5000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 20W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను అమర్చారు. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్ 5.1, వైఫై 802.11, GPS, A-GPS, Galileo, Glonass, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, యాక్సెలిరోమీటర్, SAR సెన్సార్, సెన్సార్ హబ్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








