Home
Mobile

50MP కెమెరా, 5000mAh తో మోటోరోలా 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి త్వరలో మరో G సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కానుంది. గ్లోబల్‌ మార్కెట్‌ కంటే ముందే భారత్‌ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. మోటోరోలా ఇండియా వెబ్‌ సైట్ సహా ప్రమఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. మోటో G45 5G స్మార్ట్‌ఫోన్‌ (Moto G45 5G Smartphone) విడుదల వివరాలను ధ్రువీకరించాయి. ఈ హ్యాండ్‌సెట్‌ వేగాన్‌ లెదర్‌ డిజైన్‌ సహా 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.

వేగాన్‌ లెదర్‌ డిజైన్‌ :
మోటో G45 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ లో ఆగస్టు 21వ తేదీన విడుదల కానుంది. ఈ హ్యాండ్‌ సెట్‌ వేగాన్‌ లెదర్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌ సైట్‌ ఆధారంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆకర్షణీయమైన డిజైన్‌ ను కలిగి ఉంది. కొన్ని లీక్‌ల ఆధారంగా బ్లూ, మెజెంటా, గ్రీన్‌ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

Moto G45 5G Smartphone

మోటోరోలా ఇండియా సంస్థ అందించిన వివరాల ఆధారంగా మోటో G45 5G స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 3 రక్షణను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ Hi Res ఆడియో, డాల్బీ అట్మాస్‌, స్మార్ట్‌ కనెక్ట్‌ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌ :
ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ఆధారంగా మోటో G45 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉండగా.. మరో కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేయబడుతుంది.

5000mAh బ్యాటరీ :
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో వస్తుంది. మరియు 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన రేటింగ్‌తో కూడిన వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌గా రానుందని సమాచారం.

ఇప్పటి వరకు అందిన వివరాలు ఆధారంగా ఈ మోటో G45 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ స్టోరేజీ వేరియంట్‌లు సహా ధర వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ జరగనుండగా.. తేదీ వెల్లడి కావాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G45 5G Smartphone launch date revealed in india specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X