ఇక ఆఫ్‌లైన్ స్టోర్‌లలో Moto G5, Moto G5 plus

మోటరోలా నుంచి కొద్ది రోజుల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన మోటో జీ5, మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ఇంకా అమెజాన్‌లో మాత్రమే దొరుకుతోన్న విషయం తెలిసిందే. తాజగా నెలకున్న పోటీ వాతవరణం నేపథ్యంలో ఈ ఫోన్‌లను ఆన్‌లైన్ మార్కెట్‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ ఉంచాలని లెనోవో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. NDTV పోస్ట్ చేసిన కధనం ప్రకారం.. ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన స్టాక్స్ ఇప్పటికే ఆఫ్ లైన్ రిటైలర్ల వద్దకు చేరాయి. దీంతో ఈ ఫోన్‌లు ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ అందుబాటులోకి రాబోతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేలతో

మోటో జీ5 అలానే జీ5 ప్లస్ వర్షన్‌లు ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేలతో వస్తున్నాయి. మోటో జీ5 మోడల్ 5 అంగుళాల (1080x1920పిక్సల్స్) డిస్‌ప్లేతో వస్తోండగా, మోటో జీ5 ప్లస్ మోడల్ 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్‌తో వస్తోంది. ఫోన్ డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్స్ అలానే జెంటిల్ కర్వుస్ ఆకట్టుకుంటాయి.

 

ఆపరేటింగ్ సిస్టం..

ఆండ్రాయిడ్, 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న ఈ 5వ తరం మోటో జీ హ్యాండ్‌సెట్‌‌లు ఆధునీకరించబడిన డిజైనింగ్‌తో పాటు బెటర్ క్వాలిటీ హార్డ్‌వేర్ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ప్రాసెసర్ ఇంకా ర్యామ్

మోటో జీ5 ఫోన్ 1.4GHz స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ మోడల్ 2GHz ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ర్యామ్ విషయానికి వచ్చేసరికి మోటో జీ5 ఫోన్ 3జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ 2జీబి, 3జీబి అలానే 4 జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

స్టోరేజ్ కెపాసిటీ..

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి.. మోటో జీ5, మోటో జీ5 ప్లస్ మోడల్స్ 16జీబి, 32జీబి, 64జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

కెమెరా విషయానికి వచ్చేసరికి,

మోటో జీ5 ఫోన్.. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్.. 12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో పాటు, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. మోటో జీ5 ప్లస్ కెమెరా ద్వారా 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ ఇంకా కనెక్టువిటీ ఫీచర్లు...

మోటో జీ5 మోడల్ 2,800mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ మోడల్ 3,000mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. టర్బో ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్న ఈ రెండు ఫోన్‌లలో బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది. ఈ రెండు ఫోన్‌లు 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి.

ధరలు..

మార్కెట్లో మోటో జీ5 మోడల్‌ను రూ.11,999గా ధర ట్యాగ్‌తో విక్రయిస్తున్నారు. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ ప్రారంభ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
Moto G5 and Moto G5 Plus can now be purchased through retail stores across India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot