Moto G5 Plus వాడుతున్నారా..? ఈ అప్‌డేట్ మీ కోసమే
NPN25.137-67 వర్షన్‌లో ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది.
మోటరోలా నుంచి కొద్ది నెలల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన మోటో జీ5 ప్లస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందుకుంది. NPN25.137-67 వర్షన్‌లో ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది. జీ5 ప్లస్ యూజర్లు ఈ కొత్త అప్‌డేట్‌ను పొందటం ద్వారా స్టెబిలిటీ, బగ్ ఫిక్సెస్‌తో పాటు వీడియోలను చిత్రీకరించుకునే సమయంలో మెరుగైన ఆడియో క్వాలిటీని ఆస్వాదించగలుగుతారు.

OTA అప్‌డేట్
ఈ OTA అప్‌డేట్ సైజు 215MB. వై-ఫై లేదా మొబైల్ డేటా ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ మీ ఫోన్‌కు అందినట్లు నోటిఫికేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

అప్‌డేట్‌ను పొందటం ద్వారా...
ఈ అప్‌డేట్‌ను పొందటం ద్వారా వీడియో రికార్డింగ్ సమయంలో ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అంతేకాకుంగా నోటిఫికేషన్ ప్యానల్ లో కొత్త 4జీ ఐకాన్ కనిపిస్తుంది. ఇవికాకుంగా ఫోన్ లో ఏమైనా బగ్ ఫిక్సెస్ ఉంటే తొలగిపోతాయి.

మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్..
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ ( (3జీబి, 4జీబి ర్యామ్), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్..
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్. 3జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. 4జీబి ర్యామ్ + 32జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999. Flipkart ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








