Moto G5 Plus ధర తగ్గింది
4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్...
Moto G5S Plus నేపథ్యంలో మునుపటి మోడల్ అయిన Moto G5 Plus ధరను మోటరోలా ఇండియా తగ్గించింది. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో, రూ.16,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతున్న 4జీబి వేరియంట్ మోటో జీ5 ప్లస్‌ను రూ.14,999కే సొంతం చేసుకోవచ్చు. 3జీబి ర్యామ్ వేరియంట్ పై ధర తగ్గింపుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్.. 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ ( (3జీబి, 4జీబి ర్యామ్), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి). మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

ఈ ఫోన్ కొనుగోలు పై 'Buyback Guarantee' ప్రోగ్రామ్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా మోటో జీ5 ప్లస్ యూజర్లు వచ్చే 6 నుంచి 8 నెలల కాలంలో తమ ఫోన్‌ను వేరొక కొత్త ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోదలిచినట్లయితే రూ.7,000 ఫిక్సుడ్ డిస్కౌంట్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








