మోటో జీ5 ప్లస్ బెస్టా..?, రెడ్మీ నోట్ 4 బెస్టా..?

మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ లాంచ్ అయిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో సానుకూల అంశాలతో పాటు ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి.

|

లెనోవో నేతృత్వంలోని మోటరోలా ఇటీవల తన 5వ తరం మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో షియోమీ కూడా తన రెడ్మీ నోట్ 4 ఫోన్‌ను కూడా మార్కెట్లో విడుదల చేసింది.

Read More : Redmi 4A, రూ.5,999కే బెస్ట్ బడ్జెట్ ఫోన్

మోటో జీ5 ప్లస్ vs  రెడ్మీ నోట్ 4

మోటో జీ5 ప్లస్ vs రెడ్మీ నోట్ 4

మోటరోలా నుంచి విడులైన మోటో జీ5 ప్లస్ ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంచారు. 3జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్. మరోవైపు రెడ్మీ నోట్ 4ను కూడా మూడు వేరియంట్ లలో అందుబాటులో ఉంచారు. Flipkart ఈ ఫోన్‌లను ఎక్స్ క్లూజివ్‌గా విక్రయిస్తోంది. నేటి స్పెషల్ ఫీచర్ స్టోరీలో భాగంగా మోటో జీ5 ప్లస్ అలానే రెడ్మీ నోట్ 4ల మధ్య వ్యత్యాసాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

డిస్‌ప్లే

డిస్‌ప్లే

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి మోటో జీ5 ప్లస్ ఫోన్ 5.2 అంగుళాల (1920x1080పిక్సల్) హైడెఫినిషన్ డి‌స్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. మరోవైపు రెడ్మీ నోట్ 4 ఫోన్ 5.5 అంగుళాల ఫుల్  హైడెఫినిషన్ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటోంది.

హార్డ్‌వేర్
 

హార్డ్‌వేర్

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సమానమైన ప్రాసెసర్‌లను షేర్ చేసుకున్నాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్ అలానే అడ్రినో 506 జీపీయూలతో వస్తోన్న ఈ ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అలానే బ్యాటరీ లైఫ్‌లు బాగుంటాయి.

మోటో జీ5 ప్లస్ స్టోరేజ్

మోటో జీ5 ప్లస్ స్టోరేజ్

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి మోటో జీ5 ప్లస్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 3జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

రెడ్మీ నోట్ 4  స్టోరేజ్

రెడ్మీ నోట్ 4 స్టోరేజ్

రెడ్మీ నోట్ 4 విషయానికి వచ్చేసరికి మూడు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 2జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 64జీబి. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

 

కెమెరా విషయానికి వచ్చేసరికి

కెమెరా విషయానికి వచ్చేసరికి

కెమెరా విషయానికి వచ్చేసరికి మోటో జీ5 ప్లస్ ఫోన్ 12 మెగా పిక్సల్ డ్యుయల్ టోన్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంటుంది . మరోవైపు రెడ్మీ నోట్ 4 ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

 

కనెక్టువిటీ ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు

కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌‌ఫోన్‌లు 4G VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మోటో జీ5 ప్లస్ ఫోన్ 3000mAh బ్యాటరీతో వస్తోంది. టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ బ్యాటరీ వేగంగా చార్జ్ కాగలదు. మరోవైపు రెడ్మీ నోట్ 4 ఫోన్ శక్తివంతమైన 4100mAh బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ బ్యాటరీ కూడా వేగంగా చార్జ్ కాగలదు.

ధరలు

ధరలు

రెడ్మీ నోట్ 4, 2జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్, 3జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.14,999. 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.16,999.

ఫైనల్ రిజల్ట్స్..

ఫైనల్ రిజల్ట్స్..

మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ లాంచ్ అయిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో సానుకూల అంశాలతో పాటు ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ కోరుకునే వారికి మోటో జీ5 ప్లస్ బెస్ట్ అనిపిస్తుంది. కస్టమైజేషన్ ఇంకా సుధీర్ఘమైన బ్యాటరీ లైఫ్‌ను కోరుకునే వారికి రెడ్మీ నోట్ 4 బెస్ట్ అనిపిస్తుంది.

అప్పుడు రూ.2000కే నోకియా 4జీ ఫోన్ ఇస్తారా..?అప్పుడు రూ.2000కే నోకియా 4జీ ఫోన్ ఇస్తారా..?

Best Mobiles in India

English summary
Moto G5 Plus vs Xiaomi Redmi Note 4: A mid-range match. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X