మోటో జీ5, జీ5 ప్లస్‌‌ల మధ్య తేడాలేంటి..?

మోటో జీ5 ప్లస్‌కు మినీ వర్షన్‌గా భావిస్తోన్న మోటో జీ5 స్మార్ట్‌ఫోన్ మరికొద్ది సేపట్లో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతోంది. మోటో జీ4, మోటో జీ4 ప్లస్ ఫోన్‌లకు సక్సెసర్ వర్షన్‌లగా మోటరోలా అందుబాటులోకి తీసుకువచ్చిన మోటో జీ5, మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను, తొలత బార్సిలోనా వేదికగా ఫిబ్రవరిలో నిర్వహించిన 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రదర్శించటం జరిగింది.

Read More : రూపాయికే రెడ్‌మీ నోట్ 4, సేల్ ఎప్పుడంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ5 ప్లస్ Flipkart ఎక్స్‌క్లూజివ్‌

మోటో జీ5 ప్లస్ వేరియంట్‌ను కొద్ది రోజుల క్రితమే ఇండియాలో రిలీజ్ చేయటం జరిగింది. ధర రూ.14,999. Flipkart ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 

మోటో జీ5 Amazon ఎక్స్‌క్లూజివ్...

మరికొద్ది సేపట్లో విడుదల కాబోతోన్న మోటో జీ5 Amazon Indiaలో మాత్రమే దొరుకుతుంది. ఈ రెండు ఫోన్‌ల మధ్య తేడాలను పరిశీలించినట్లయితే..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

మోటో జీ5 వేరియంట్ 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1080x1920పిక్సల్స్)తో వస్తోంది.  జీ5 ప్లస్ వేరియంట్ 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది.

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి..

మోటో జీ5 వేరియంట్ ఎంట్రీ లెవల్ 1.4GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో జీ5 ప్లస్ వేరియంట్ మిడ్ రేంజ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్ పై రన్ అవుతుంది.

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి..

మోటో జీ5 మోడల్ రెండు రకాల స్టోరేజ్ ఇంకా వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్, రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకోవచ్చు.

జీ5 తరహలోనే జీ5 ప్లస్ మోడల్ కూడా రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 3 జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, రెండవ వేరియంట్ 4 జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకోవచ్చు.

 

కెమెరా విషయానికి వచ్చేసరికి..

మోటో జీ5 మోడల్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ మోడల్ అడ్వాన్సుడ్ 12 మెగా పిక్సల్ డ్యుయల్ ఆటో ఫోకస్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ క్యామ్‌ను కలిగి ఉంటుంది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి..

మోటో జీ5 మోడల్ 2800mAh బ్యాటరీ కెపాసిటీతో, మోటో జీ5 ప్లస్ మోడల్ 3000mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తున్నాయి.

ధర విషయానికొస్తే..

మోటో జీ5 ప్లస్ 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. మోటో జీ5 ధర మరికొద్ద సేపట్లో రివీల్ కాబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G5 vs Moto G5 Plus: What's the difference?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot