మోటో G56 కలర్ వేరియంట్స్ లీక్... 50MP కెమెరా, 5200mAh బ్యాటరీ, IP69 రేటింగ్..!
మోటోరోలా భారత్‌లో ఇటీవల అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో గత వారం విడుదల అయిన మోటోరోలా Razr 60 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్‌తోపాటు మోటో ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 స్టైలస్, ఎడ్జ్ 60 ప్రో మోడల్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అయితే మరిన్ని హ్యాండ్‌సెట్‌లు త్వరలో విడుదల కానున్నాయి.
తాజాగా మోటో G56 వివరాలు (Moto G56 Smartphone) లీక్ అయ్యాయి. గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన మోటో G55 ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా ఈ G56 విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ డిజైన్ వివరాలు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం నాలుగు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

నాలుగు కలర్ వేరియంట్స్ :
డచ్ వెబ్‌సైట్ Nieuwemobiei ఆధారంగా మోటో G56 ఫోటోలు లీక్ అయ్యాయి. బ్లాక్, బ్లూ, గ్రీన్ వంటి మూడు రంగుల్లో కనిపించాయి. నాలుగో కలర్ వేరియంట్ గురించి తెలియాల్సి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ ముందువైపు పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ కింద వైపు థిక్ డిస్‌ప్లే బెజెల్స్‌ను గుర్తించవచ్చు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మోటో G56 ఫోన్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ కెమెరా మాడ్యూల్ డిజైన్... మోటోరోలా ఎడ్జ్ సిరీస్ తరహాలో ఉంది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ ఆకట్టుకొనే అవకాశం ఉంది.
మోటో G56 స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
మోటో G56 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 SoC చిప్‌సెట్ పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది.
మోటో స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1080 x 2400 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరియు ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i కోటింగ్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరాతోపాటు 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వస్తుందని సమాచారం.
మోటో G56 హ్యాండ్‌సెట్ 33W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 250 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.23,700) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
మోటో G56 స్మార్ట్‌ఫోన్ విడుదలపై మోటోరోలా సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. పైన తెలిపిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను గురించి కూడా సంస్థ స్పందించలేదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు మోటో ఎడ్జ్ 60 ఫోన్ కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








