భలే ఛాన్స్.. రూ.12999 ధరకే 7000mAh భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 OS ఫోన్ సేల్..!
Moto G57 Power 5G Sale : మోటోరోలా సంస్థ భారత్ మార్కెట్‌లో గత నెలలో మోటో G57 పవర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇవాళ్టి నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ చిప్‌తో లాంచ్ అయిన తొలి ఫోన్‌గా నిలిచింది. దీంతోపాటు 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, సేల్ పూర్తి వివరాలు.
మోటో G57 పవర్ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.12999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్ మోటోరోలా ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ పాంటోన్ కోర్సెయిర్, పాంటోన్ రెగట్టా, పాంటోర్ ప్యూడిటీ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.
ఫుల్ HD+ డిస్‌ప్లే :
మోటో G57 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1050 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్, ఆండ్రాయిడ్ 16 OS :
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ స్నా్ప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 4GB LPDDR4X ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS (Out of the box) పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 17 OS తోపాటు 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తోపాటు 2 ఇన్ 1 లైట్ సెన్సర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 8MP కెమెరాను అమర్చి ఉంది. ఈ కెమెరాలతో 60fps తో 2K వీడియోలను రికార్డు చేయవచ్చు.
భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీంతోపాటు Magic Eraser, షాట్ ఆప్టిమైజేషన్, సినిమాటిక్ ఫోటోస్, ఫోటో అన్‌బ్లర్, ఆటో ఫ్రేమ్, పొర్ట్రెయిట్ బ్లర్, పొర్ట్రెయిట్ లైట్ వంటి అనేక ఫీచర్‌లు ఉన్నాయి.
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్ 5.1, USB-C ఛార్జింగ్ పోర్టు, GPS వంటి ఫీచర్లున్నాయి. గైరోస్కో్ప్, ప్రాక్సిమిటీ సెన్సర్, ఇ-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సర్ ఉన్నాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే స్మార్ట్‌వాటర్ టచ్ 2.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.


Click it and Unblock the Notifications








