7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో 5G స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా (Moto India) ఇటీవల పవర్ పేరుతో స్మార్ట్‌ఫోన్ లను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే మోటో G86 పవర్, మోటో G06 పవర్, మోటో G67 పవర్ పేరుతో ఫోన్‌లను లాంచ్ చేసింది. పవర్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఫోన్‌లు భారీ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. అయితే తాజాగా మరో పవర్ మోడల్ ను లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా వెల్లడించింది.
మోటోరోలా నుంచి త్వరలో G57 పవర్ స్మార్ట్‌ఫోన్ (Moto G57 Power Smartphone) విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఇటీవలే గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ కాగా.. భారత్ మార్కెట్ లో నవంబర్ 24 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
మోటో G57 పవర్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తోపాటు పాంటోన్ క్యూరేటెడ్ లెదర్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ వేరియంట్స్ లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ మోటో ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1050 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్ ను పొందుతుంది. IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Power that pushes every limit. ⚡
— Motorola India (@motorolaindia) November 18, 2025
The moto g57 POWER — featuring the world’s 1st Snapdragon® 6s Gen 4 + Android 16 for ultra-smooth performance. 50MP Sony LYTIA™ 600 camera, 7000mAh battery & a tough 120Hz FHD+ display.
Launching 24 Nov. #MotoG57Power #Motorola #BeUnstoppable pic.twitter.com/r88kRZlcjN
తొలి ఫోన్ ఇదే! :
మోటోరోలా హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్ తో పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ చిప్‌తో లాంచ్ అయ్యే తొలి ఫోన్ ఇదేనని మోటో చెబుతోంది. ఈ చిప్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్‌తోపాటు మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని మోటో చెబుతోంది.
7000mAh బ్యాటరీ, 50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8MP కెమెరాతో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 30W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్, High-Res ఆడియో సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. భారత్ మార్కెట్‌లో ఈ ఫోన్ రూ.13000 ప్రారంభ ధరకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








