Home
Mobile

రూ.14999 ధరకు 7000mAh భారీ బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌..!

మోటోరోలా సంస్థ భారత్‌ మార్కెట్‌లో పవర్‌ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే మోటో G86 పవర్‌, మోటో G06 పవర్‌, మోటో G67 పవర్‌ మోడల్స్‌ ఇప్పటికే భారత్‌లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా మోటో G57 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో ఈ నెల తొలిరోజుల్లో లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 4 ప్రాసెసర్‌పై లాంచ్‌ అయిన తొలి ఫోన్‌గా G57 పవర్ నిలిచింది. మరియు ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.

మోటో G57 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1050 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 120Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 20:9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది.

Moto G57 Power Smartphone

ఈ హ్యాండ్‌సెట్ (Moto G57 Power Smartphone) స్మార్ట్‌వాటర్‌ టచ్‌ 2.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ మోటో ఫోన్‌ 4nm స్నా్ప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌ 4GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌, 2 in 1 లైట్‌ సెన్సర్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరా ఉంది. ఈ కెమెరాలతో 60fps వద్ద 2K వీడియోలను రికార్డు చేయవచ్చు.

Moto G57 Power Smartphone

ఈ కెమెరాలు అనేక AI ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. షాట్‌ ఆప్టిమైజేషన్‌, మేజిక్ ఎరేజర్‌, స్కై కలర్‌ పాప్‌, సినిమాటిక్‌ ఫోటోస్‌, Auto Smile Capture, Photo Unblur, Reimagine Auto Frame, Portrait Blur, Portrait Light వంటి ఫీచర్లు ఉన్నాయి.

మోటో G57 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోం సైట్‌ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది. 5G, 4G LTE, డ్యూయల్‌ బ్యాండ్ వైఫై, బ్లూటూత్‌ 5.1, USB-C ఛార్జింగ్ ఫోర్టు, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇ-కంపాస్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌, గైరోస్కోప్ వంటి సెన్సర్లు ఉన్నాయి.

మోటో G57 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. ఈ ఫోన్ డిసెంబర్‌ 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. మోటోరోలా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

మోటో G57 పవర్‌ ఫోన్‌ను SBI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై రూ.1000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ పాంటోన్‌ కోర్సెయిర్‌, పాంటోన్‌ రెగట్టా, పాంటోర్‌ ప్యూడిటీ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Moto G57 Power Smartphone with Snapdragon 6s Gen 4 Chip, 7000mAh Battery launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X