మోటరోలా నుంచి రెండు కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

మోటారోలా నుంచి రెండు వారాల క్రితం అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ అయిన Moto G5S, Moto G5S Plus స్మార్ట్‌ఫోన్‌లు మరికొద్ది రోజుల్లో భారత్‌కు రాబోతున్నాయి.

Read More : ఇంటర్నెట్‌ లేకుండా మొబైల్ బ్యాంకింగ్ సాధ్యమే, అది ఎలాగో తెలుసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ5, మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడెడ్ వర్షన్స్..

మోటో జీ5, మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడెడ్ వర్షన్‌లుగా భావిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఆగష్టు 22న మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

యూరోప్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి..

యూరోప్ మార్కెట్లో మోటో జీ5ఎస్ ధర €249 (రూ.18,900)గాను మోటో జీ5ఎస్ ప్లస్ ధర €299 (రూ.22,700)గాను ఉంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్‌ల ధరలు ఏ విధంగా ఉంటాయన్నది తెలియాల్సి ఉంది.

Moto G5S స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (f/2.0 అపెర్చుర్, ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (f/2.0 అపెర్చుర్, ఎల్ఈడి ఫ్లాష్), 3,000mAh బ్యాటరీ విత్ టర్బో పవర్ ఛార్జింగ్.

Moto G5S Plus స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), డ్యుయల్ రేర్ కెమెరా సపోర్ట్ (13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ విత్ టర్బో పవర్ ఛార్జింగ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

స్పెసిఫికేషన్స్ పరంగా మరింత బలంగా..

స్పెసిఫికేషన్స్ పరంగా మరింత బలంగా కనిపిస్తోన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు రూ.20,000 ధర సెగ్మెంట్‌లోని ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు బలమైన పోటీగా నిలిచే అవకాశముంది. ఆగష్టు 22న ఈ ఫోన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి.  

డ్యుయల్ కెమెరా ప్రధాన హైలైట్

మోటో జీ5ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు డ్యుయల్ కెమెరా సెటప్ ప్రధాన హైలైట్‌గా చెప్పుకోవచ్చు.డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే ఫోన్‌లలో ఒక కెమెరా లెన్స్ ఉండాల్సిన స్థానంలో రెండు కెమెరా లెన్సులు ఉంటాయి. వీటిలో ఒకటి ప్రైమరీ లెన్స్ కాకా, మరొకటి సెకండరీ లెన్స్. ఫోటోలను చిత్రీకరించుకునే సమయంలో ప్రైమరీ లెన్స్ మేజర్ లిఫ్టింగ్ పై దృష్టిసారిస్తే, సెకండరీ లెన్స్ అదనపు లైట్ ఇంకా ఫీల్డ్ డెప్త్ పై పనిచేస్తుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G5S, Moto G5S Plus to launch in India by end of this month. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot