మోటోరోలా నుంచి అదిరే ఫీచర్లతో మూడు ఫోన్లు, ఓ స్మార్ట్ లుక్కేయండి

|

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా కొత్తగా మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. మోటో జీ6, మోటోజీ6 ప్లస్‌, మోటో జీ6ప్లే అనే వేయింట్లను బ్రెజిల్ లో జరిగిన ఈవెంట్లో లాంచ్ చేసింది. జీ6 సీరిస్ కింద వచ్చిన ఈఫోన్లు బడ్జెట్ రేంజులో యూజర్లకు అందనున్నాయి. ఈ ఫోన్లలో కొత్త "యానిమేటెడ్ ఫేస్‌ ఫిల్టర్లు" 'కట్అవుట్' ఫీచర్, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌లు ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. వచ్చే వారం నుంచి గ్లోబల్ వైడ్ గా ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే రానున్న కొద్ది వారాల్లో ఈ ఫోన్లు ఇండియాలో అఫిషియల్ గా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మోటో జీ6 ప్లే ధరను కంపెనీ రూ.13,135, మోటో జీ6 రూ. 16,435, మోటో జీ6 ప్లస్ రూ.24, 300గా నిర్ణయించింది. అయితే ఇండియాలో ఈ ధరలు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. కాగా మోటో జీ6 నాలుగు రంగుల్లో Indigo, Black, Blush, and Silverల్లో రాగా Moto G6 Play రెండు రంగుల్లో Deep Indigo and Flash Grayలో వచ్చింది.

 
మోటోరోలా నుంచి అదిరే ఫీచర్లతో మూడు ఫోన్లు, ఓ స్మార్ట్ లుక్కేయండి

మోటో జీ6 ధర, ఫీచర్లు
5.7 అంగుళాల మాక్స్ విజన్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
18: 9 కారక నిష్పత్తి, ఫుల్‌ హెచ్‌డీ రిజల్యూషన్‌
4జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
12 +5 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మోటో జీ6 ప్లస్ ధర, ఫీచర్లు
5.93 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ప్యానెల్
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
6జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
12 మెగా పిక్సెల్ రియర్‌ కెమెరా
5 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
3200 ఎంఏహెచ్‌

OPPO F7లో కెమెరాలో దాగిన సీక్రెట్ ఫీచర్స్ ఇవే !OPPO F7లో కెమెరాలో దాగిన సీక్రెట్ ఫీచర్స్ ఇవే !

మోటోజీ6 ప్లే ధర, ఫీచర్లు
5.7-అంగుళాల డిస్‌ప్లే 18: 9 కారక నిష్పత్తి
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
2జీబీ ర్యామ్‌16జీబీ స్టోరేజ్‌
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
13 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Moto G6, Moto G6 Plus, Moto G6 Play launched: Full specs, top features, price and everything you need to know More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X