సెప్టెంబర్ 10న దేశీయ మార్కెట్లోకి రానున్న మోటో జీ6 ప్లస్
దిగ్గజ మొబైల్ సంస్థ లెనోవొ మోటోరోలా తన సరికొత్త జీ సీరిస్ ఫోన్ మోటో జీ6 ప్లస్ ను త్వరలో ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది.
దిగ్గజ మొబైల్ సంస్థ లెనోవొ మోటోరోలా తన సరికొత్త జీ సీరిస్ ఫోన్ మోటో జీ6 ప్లస్ ను త్వరలో ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనుందనే వార్తలు వెలువడుతున్నాయి.గతంలో వచ్చిన మోటో జీ6 ,మోటో జీ6 ప్లే కీ కొనసాగింపు వెర్షన్ గా ఈ మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ మోటో జీ6 ప్లస్ లో 5.9 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 12, 5 మోగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలు వెనుక భాగంలో ఉన్నాయి.ఈ మోటో జీ6 ప్లస్ ధర రూ.20,000 లోపు ఉండవచ్చు అని సమాచారం.

మోటో జీ6 ప్లస్ ఫీచర్స్...
5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

మోటో జీ6 ఫీచర్స్ (ధర రూ.13,999)....
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మోటో జీ6 ప్లే ఫీచర్స్ (ధర రూ. 11,999)....
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








