మోటో జీ6 ప్లస్ వచ్చేస్తోంది, ధర ఎంతంటే..?

మోటరోలా నుంచి కొద్ది రోజుల క్రితం బ్రెజిల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన మోటో జీ6 ప్లస్ త్వరలో భారత్‌కు రాబోతోంది.

|

మోటరోలా నుంచి కొద్ది రోజుల క్రితం బ్రెజిల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన మోటో జీ6 ప్లస్ త్వరలో భారత్‌కు రాబోతోంది. ఈ మిడ్-రేంజ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మోటో జీ6, మోటో జీ6 ప్లే స్మార్ట్‌ఫోన్‌లతో పాటుగా మోటరోలా అనౌన్స్ చేసిన విషయంలో తెలిసిందే. వీటిలోని మోటో జీ6, మోటో జీ6 ప్లే మోడల్స్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేయటం జరిగింది.మోటో జీ6, మోటో జీ6 ప్లే స్మార్ట్‌ఫోన్‌లతో పోల్చి చూసినట్లయితే మోటో జీ6 ప్లస్ పెద్దదైన డిస్‌ప్లే, వేగవంతమైన ప్రాసెసర్ ఇంకా శక్తివంతమైన ర్యామ్ వ్యవస్థలను కలిగి ఉంటుంది. మోటో జీ6 ప్లస్ ఇండియా లాంచ్‌కు సంబంధించిన వివరాలను మోటరోలా ఇండియా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అనౌన్స్ చేసింది.

moto g6 plus

16 సెకన్ల టీజర్ వీడియో..
"coming soon" అనే ట్యాగ్‌లైన్‌తో ఈ టీజర్ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ 16 సెకన్ల టీజర్ వీడియోలో మోటో జీ6 ప్లస్ అరైవల్‌కు సంబంధించి పలు ఆసక్తికర వీడియోలను మోటరోలా ప్రస్తావించింది. ఈ టీజర్‌ను బట్టి చూస్తుంటే మోటో జీ6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు స్మార్ట్ కెమెరా ఫీచర్ ప్రధాన హైలైట్‌గా నిలవనుందని స్పష్టమవుతోంది.

లాభాల్లో దుమ్మురేపిన రిలయన్స్, జియో కస్టమర్లకు పండగే !లాభాల్లో దుమ్మురేపిన రిలయన్స్, జియో కస్టమర్లకు పండగే !

మోటో జీ6 ప్లస్ ధర...
ధర విషయానికి వచ్చేసరికి యూరోపియన్ మార్కెట్లో మోటో జీ6 ప్లస్ ధర 299 యూరోలుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.24,350. ఇండియన్ మార్కెట్లో మోటో జీ6 ప్లస్ ధర ఎంత ఉండొచ్చు అనే దాని పై ఇప్పటి వరకు స్పష్టమైన క్లారిటీ లేదు. ఈ ఫోన్‌తో పాటుగా మోటరోలా ఆవిష్కరించిన మోటో జీ6 ధర ఇండియన్ మార్కెట్లో రూ.13,999 నుంచి ప్రారంభమవుతోంది. మరో మోడల్ అయిన మోటో జీ6 ప్లే ధర రూ.11,999 నుంచి ప్రారంభమవుతోంది. వీటిలో మోటో జీ6 మోడల్‌ను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తుంటే, మోటో జీ6 ప్లేను ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది.

మోటో జీ6 ప్లస్ స్పెసిఫికేషన్స్..
5.93 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, అడ్రినో 508 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3200mAh బ్యాటరీ విత్ మోటరోలా టర్బో పవర్ అడాప్టర్, కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి (4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్), ఫోన్ చుట్టుకొలత 159.9x75.5x7.99 మిల్లీ మీటర్లు, బరువు 165 గ్రాములు.

Best Mobiles in India

English summary
Moto G6 Plus will arrive in India soon. The company is teasing the launch of the mid-range smartphone in the country.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X