6జీ ర్యామ్‌తో మోటో జీ6 ప్లస్ వచ్చేసింది, ధర రూ.22,499

మోటరోలా తన మోటో జీ6 సిరీస్ నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

By GizBot Bureau
|

మోటరోలా తన మోటో జీ6 సిరీస్ నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. మోటో జీ6 ప్లస్ (Moto G6 Plus) పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.22,499. అమెజాన్.ఇన్‌తో పాటు మోటో హబ్స్ అలానే మోటరోలా ఆఫ్‌లైన్ రిటైలర్ పార్టనర్స్ వద్ద ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

గ్లోబల్ వేరియంట్‌తో పోలిస్తే ఎక్కువ ర్యామ్ సపోర్ట్..

గ్లోబల్ వేరియంట్‌తో పోలిస్తే ఎక్కువ ర్యామ్ సపోర్ట్..

గతంలో మోటో జీ6 సిరీస్ నుంచి లాంచ్ అయిన మోటో జీ6, జీ6 ప్లే స్మార్ట్‌ఫోన్‌లకు మోటో జీ6 ప్లస్ హయ్యిర్ వెర్షన్ అని చెప్పొచ్చు. మోటో జీ6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన గ్లోబల్ వేరియంట్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో మోటరోలా ప్రపంచానికి పరిచయం చేసింది. మోటో జీ6, జీ6 ప్లే స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే జీ6 ప్లస్ డివైస్‌లో పెద్దదైన డిస్‌ప్లే, అదనపు ర్యామ్ ఇంకా వేగవంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థలు ఉంటాయి. భారత్‌లో లాంచ్ అయిన మోటో జీ6 ప్లస్ వేరియంట్ 6జీబి ర్యామ్ కెపాసిటీతో అందుబాటులో ఉండటం విశేషం. ఇదే సమయంలో ఇంటర్నేషనల్ వేరియంట్ 4జీబి ర్యామ్ కెపాసిటీతో మాత్రమే లభ్యమవుతోంది.

 

 

మోటో జీ6 ప్లస్ స్పెసిఫికేషన్స్...
 

మోటో జీ6 ప్లస్ స్పెసిఫికేషన్స్...

5.93 అంగుళాల ఫుల్ హెడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1080x2160 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, స్టాక్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడ్‌బుల్ టు Android Pie), 2.2గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ విత్ అడ్రినో 508 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ సపోర్ట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పొడిగించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమేరా విత్ డ్యుయల్ టోన్ అండ్ డ్యుయల్ లెన్స్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా విత్ సెల్ఫీఫ్లాష్ ఇన్ ఫ్రంట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ మోటరోలా టర్బో పవర్ అడాప్టర్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్.

కనెక్టువిటీ ఫీచర్స్ ఇంకా లాంచ్ ఆఫర్స్..

కనెక్టువిటీ ఫీచర్స్ ఇంకా లాంచ్ ఆఫర్స్..

ఇక కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఇంకా స్టాండర్డ్ సెన్సార్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి. ఇండిగో బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ చుట్టుకొలత 159.9x75.5x7.99 మిల్లీ మీటర్లు, బరవు 165 గ్రాములు. లాంచ్ ఆఫర్స్ క్రింద పేటీఎమ్ మాల్ యాప్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లు రూ.3000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో జియో యూజర్లకు రూ.198, రూ.299 రీఛార్జుల పై రూ.4,450 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
Moto G6 Plus With 6GB RAM, Dual Rear Cameras Launched in India: Price, Specifications, More.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X