Just In
- 7 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 9 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 12 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 15 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
అదరగొట్టే ఫీచర్లతో భారత మార్కెట్లో Moto G62 స్మార్ట్‌ఫోన్ విడుదల..!
మోటో కంపెనీ భారత మార్కెట్‌కు మరో కొత్త మొబైల్‌ను పరిచయం చేసింది. Moto G62 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మొబైల్ పలు అప్‌గ్రేడెడ్ వర్షన్ ఫీచర్లతో యూజర్ల ముందుకు వస్తోంది. దీనికి Snapdragon 695 SoC ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ 6.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. అంతేకాకుండా దీనికి 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరల వివరాలను కూడా తెలుసుకుందాం.

భారత్‌లో Moto G62 ధరలు:
భారత మార్కెట్లో Moto G62 మొబైల్స్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభించనున్నాయి. 6GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు.భారత మార్కెట్లో ఇవి ఫ్రస్టెడ్ బ్లూ, మిడ్‌నైట్ గ్రే కలర్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఆగస్టు 19వ తేదీ నుంచి ఇవి భారత్‌లో యూజర్లకు కొనుగోలుకు అందుబాటులోకి వస్తాయి. ఫ్లిప్ కార్ట్ వేదికగా ఇవి అందుబాటులోకి రానున్నాయి.
HDFC బ్యాంక్ కార్డ్ వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపుతో రూ.16,750 మరియు రూ.18,249 కు పొందవచ్చు.

Moto G62 స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 6.5 అంగుళాల (1,080x2,400 pixels) రిసొల్యూషన్‌తో full-HD LCD డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 695 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉండనున్నట్లు సమాచారం. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రన్ అవుతుంది. ఇక ర్యామ్ విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌కు 6GB|8GB of RAM+128GB స్టోరేజీ అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో f/1.8అపర్చర్ లెన్స్ ప్రైమరీ కెమెరాగా అందిస్తున్నారు. ఇది క్వాడ్-పిక్సెల్ టెక్నాలజీ మరియు PDAFని కూడా పొందుతుంది. ఇక మిగతా రెండు కెమెరాల్లో ఒకటి 8 మెగాపిక్సెల్ క్వాలిటీతో f/2.2 అల్ట్రా వైడ్ లెన్స్, మరొకటి 2 మెగాపిక్సెల్ క్వాలిటీతో f/2.4 అపర్చర్ మాక్రో షాట్స్ లెన్స్ ఇస్తున్నారు. ఇక వీడియో కాలింగ్ సెల్ఫీ విషయానికొస్తే.. 16 మెగాపిక్సెల్ క్వాలిటీ గల లెన్స్ ఫ్రంట్ క్యాం కు ఇస్తున్నారు.
ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000 mAh సామర్థ్యం గల బ్యాటరీ 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయల్ సిమ్ స్లాట్స్, రెండిటికీ 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ సిస్టమ్ కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా.. డ్యుయల్ బ్యాండ్ Wi-Fi, 4G LTE, బ్లూటూత్ v5.1, 3.5mm హెడ్‌ఫోన్ పోర్ట్, USB Type-C ఫీచర్లను కలిగి ఉంది.

భారత్‌లో ఇటీవల విడుదలైన Moto G32 మొబైల్‌కు సంబంధించిన ధరలు, స్పెసిఫికేషన్లు కూడా తెలుసుకుందాం:
ఈ మొబైల్ కు 6.5 అంగుళాల (1,080x2,400 pixels) రిసొల్యూషన్‌తో full-HD LCD డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 680 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉండనున్నట్లు సమాచారం. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రన్ అవుతుంది. ఇక ర్యామ్ విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌కు 4GB of RAM+64GB అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో f/1.8అపర్చర్ లెన్స్ ప్రైమరీ కెమెరాగా అందిస్తున్నారు. ఇక మిగతా రెండు కెమెరాల్లో ఒకటి 8 మెగాపిక్సెల్ క్వాలిటీతో f/2.2 అల్ట్రా వైడ్ లెన్స్, మరొకటి 2 మెగాపిక్సెల్ క్వాలిటీతో f/2.4 అపర్చర్ మాక్రో షాట్స్ లెన్స్ ఇస్తున్నారు. ఇక వీడియో కాలింగ్ సెల్ఫీ విషయానికొస్తే.. 16 మెగాపిక్సెల్ క్వాలిటీ గల లెన్స్ ఫ్రంట్ క్యాం కు ఇస్తున్నారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000 mAh సామర్థ్యం గల బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నారు.
భారత మార్కెట్లో Moto G32 మొబైల్స్ 4GB RAM + 64GB స్టోరేజీ ధరను రూ.12,999 గా నిర్ణయించారు. భారత మార్కెట్లో ఇవి మినరల్ గ్రే, సాటిన్ సిల్వర్ కలర్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఆగస్టు 16వ తేదీ నుంచి ఇవి భారత్‌లో యూజర్లకు కొనుగోలుకు అందుబాటులోకి వస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470