6000mAh బ్యాటరీ, 12GB ర్యామ్‌తో Motorola కొత్త స్మార్ట్‌ఫోన్.. ఎప్పుడు విడుదల కానుందంటే?
మోటోరోలా ఇటీవలే ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సేల్ కూడా ప్రారంభం అయింది. అయితే ఈ మోటోరోలా సంస్థ త్వరలోనే కొత్త హ్యాండ్‌సెట్ మోటో G64 5G (Moto G64 5G Smartphone) ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించి టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలను వెల్లడించింది. మరియు విడుదల తేదీని ప్రకటించింది.
ఈ టీజర్ ఆధారంగా మోటో G64 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు (Moto G64 5G Launch Date) విడుదల కానుంది. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ motorola.in మరియు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రపంచంలోనే తొలి మీడియోటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌ను కలిగి ఉందని మోటోరోలా తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ లైవ్ పేజీ ఆధారంగా ఈ మోటో G64 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ప్రీమియం, సన్నని మరియు కలర్‌పుల్ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, డిస్‌ప్లే భద్రతకు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.
ప్రపంచంలోనే తొలిసారిగా మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌ను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్ ఇదేనని ఫ్లిప్‌కార్ట్ లైవ్ పేజీ ఆధారంగా తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌తోపాటు 3 సంవత్సరాలు సెక్యురిటీ అప్‌డేట్‌లను పొందుతుందని మోటోరోలా సంస్థ వెల్లడించింది.
ఈ మోటో కొత్త హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ మరియు 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 24GB వరకు ర్యామ్‌ను పెంచుకొనే అవకాశం ఉంది. G64 5G హ్యాండ్‌సెట్ 33W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP అల్ట్రావైడ్, 8MP మ్యాక్రో విజన్+డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియోల కోసం ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంది.
మోటో G64 5G స్మార్ట్‌ఫోన్ డాల్బీ ఆట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 14 5G బ్రాండ్‌లను సపోర్టు చేస్తుంది. IP52 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ బరువు 192 గ్రాములుగా ఉంది. మరియు ఈ ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అయితే ధర వివరాలు వెల్లడి కాలేదు.
** ఇటీవల విడుదలైన మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 6.7 అంగుళాల కర్వడ్ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 144Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. DC డిమ్మింగ్ సపోర్టుతో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 125W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది.
మోటో ఎడ్జ్ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999, 12GB ర్యామ్ +256GB స్టోరేజీ ధర రూ.35999 గా ఉంది. 8GB ర్యామ్ వేరియంట్ 68W ఛార్జర్, 12GB ర్యామ్ వేరియంట్ కొనుగోలుపై 125W ఛార్జర్‌ను పొందవచ్చు. Luxe లావెండర్, మూన్‌లైట్ పెర్ల్, బ్లాక్ బ్యూటీ రంగుల్లో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications