ధర రూ.14,999 కే 6000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఈ కార్డు ద్వారా రూ.1000 తగ్గింపు!
మోటో నుంచి తాజాగా మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో మోటో G64 5G స్మార్ట్‌ఫోన్ (Moto G64 5G Smartphone Launched) లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీ సహా మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 OS పైన పనిచేస్తుంది.
మోటో G64 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటో G64 5G స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల పుల్ HD+ IPS LCD (1080*2400 పిక్సల్) డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ అయింది. 20:9 అస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. 33W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ మోటో కొత్త హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌తోపాటు 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇస్తామని సంస్థ హామీ ఇచ్చింది. మరియు ఈ మోటో G64 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. 256GB గరిష్ఠ అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ మరియు 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB స్టోరేజీ వరకు పొడిగించుకోవచ్చు.
ఈ మోటో G64 5G స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టు, ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ (PDAF) మరియు f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. ఈ లెన్స్‌ను మ్యాక్రో ఫోటోలను క్యాప్చర్ చేసేందుకు కూడా వినియోగించవచ్చు. f/2.4 అపేచర్‌తో 16MP కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు్‌ను కలిగి ఉంది. మరియు IP52 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా లాంచ్ అయింది. ఈ మోటో కొత్త స్మార్ట్‌ఫోన్ 192 గ్రాముల బరువు ఉంటుంది.
మోటో G64 5G స్మార్ట్‌ఫోన్ ధర..
మోటో G64 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. అయితే ఇవి ప్రారంభ ధరలుగా తెలుస్తోంది. ఏప్రిల్ 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది.
ఈ హ్యాండ్‌సెట్‌ను HDFC క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు. అదే HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా EMI లావాదేవీలు నిర్వహిస్తే రూ.1100 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లు ఐస్ లిలక్, మింట్ గ్రీన్, పెర్ల్ బ్లూ రంగుల్లో మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ మరియు రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications