Home
Mobile

7000mAh భారీ బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌తో 5G ఫోన్‌.. రేపే విడుదల..!

Moto G67 Power 5G Smartphone : మోటో G67 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో బుధవారం (నవంబర్‌ 5 వ తేదీ) విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌ ఇప్పటికే లైవ్‌లో ఉంది. దీని ద్వారా అనేక స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ విడుదల సహా స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు.

రెండు స్టోరేజీ వేరియంట్స్‌ :
మోటో G67 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌ లో లిస్టింగ్ అయింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల ఫుల్‌ HD+ (1080 x 2400 పిక్సల్స్‌) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 391 ppi పిక్సల్‌ డెన్సిటీ, 85.97 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది.

Moto G67 Power 5G smartphone launch news

మూడు కలర్‌ వేరియంట్స్‌ :
ఈ డిస్‌ప్లే 20:9 యాస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంది. HDR10+ ను సపోర్టు చేస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ పారాచుట్‌ పర్పుల్‌, బ్లూ కురాకో, సిలాంట్రో మూడు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఈ మోటో హ్యాండ్‌సెట్‌ ఆక్టా కోర్‌ 4nm క్వాల్‌కాం స్నా్ప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. దీంతోపాటు Adreno GPU ను కూడా కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది.

ఈ ఫోన్ ర్యామ్ బూస్ట్‌ ఫీచర్‌ ద్వారా 24GB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌తోపాటు మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని మోటో సంస్థ హామీ ఇస్తోంది. ఈ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Moto G67 Power 5G smartphone launch news

50MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా మోటో ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, టూ ఇన్‌ వన్‌ ఫ్లిక్కర్‌ కెమెరాతో లాంచ్ కానుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.2 అపేచర్‌తో 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

7000mAh బ్యాటరీ :
ఈ కెమెరాలు 30fps వద్ద ఫుల్‌ HD వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీంతోపాటు డ్యూయల్‌ క్యాప్చర్‌, టైమ్‌ ల్యాప్స్‌, స్లో మోషన్‌ వంటి ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీను కలిగి ఉంటుంది.

Moto G67 Power 5G smartphone launch news

మిలిటరీ గ్రేడ్‌ డ్రాప్‌ రెసిస్టెంట్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ MIL 810H హ్యాండ్‌సెట్‌ మిలిటరీ గ్రేడ్‌ డ్రాప్‌ రెసిస్టెంట్‌గా ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్‌ 5.1, GPS సహా అనేక ఫీచర్లు ఉంటాయి.

ఈ ఫోన్ సెక్యూరిటీ కోసం ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, యాక్సెలిరోమీటర్‌, ఫ్రాక్సిమిటీ సెన్సర్‌, గైరో స్కోప్, ఇ-కంపాస్, SAR సెన్సర్‌ను కలిగి ఉంటుంది. గూగుల్‌ జెమిని ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌తో లాంచ్‌ కానుంది.

Best Mobiles in India

English summary
Moto G67 Power 5G smartphone with 7000mAh Battery launching tomorrow in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X