15 వేల ధరలో 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో 5G ఫోన్.. ఇవాళే సేల్..!
Moto G67 Power 5G Smartphone : మోటోరోలా సంస్థ ఇటీవల పవర్ పేరుతో కొన్ని మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లు భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే మోటో G86 పవర్, మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ్టి నుంచి మోటో G67 పవర్ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ నెల తొలివారంలో ఈ ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇవాళ్టి నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.
మోటో G67 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999 గా ఉంది. అయితే త్వరలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ కూడా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌ను ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.14999 ధరకే కొనుగోలు చేయవచ్చని మోటోరోలా చెబుతోంది.

మూడు కలర్ వేరియంట్స్ :
మోటో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇవాళ మధ్యా్హ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ పాంటోన్ సిలింట్రో, పాంటోన్ పారాచుట్ పర్పుల్, పాంటోన్ బ్లూ కురాకో కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.
మిలిటరీ గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్ :
మోటో G67 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ MIL 810H మిలిటరీ గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ వేగాన్ లెదర్ ఫినిష్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 391 ppi పిక్సల్ డెన్సిటీ, HDR10+ సపోర్టును కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఈ మోటో స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. గూగుల్ జెమిని ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను కూడా కలిగి ఉంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ ఆక్టాకోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు Adreno GPU కూడా ఉంది. ఈ ఫోన్ ర్యామ్ బూస్ట్ ఫీచర్‌ను కలిగి ఉంది. దీని ద్వారా ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UX పైన పనిచేస్తోంది.
3 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని మోటోరోలా తెలిపింది. ఈ మోటో స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీతో అందుబాటులో ఉంది. 30W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
50MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2 in 1 ఫ్లిక్కర్ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 30fps వద్ద ఫుల్ HD రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు. దీంతోపాటు డ్యూయల్ క్యాప్చర్, టైం ల్యాప్స్, స్లో మోషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 3.1, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. వీటితోపాటు ఇ-కంపాస్, యాక్సెలిరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్, SAR సెన్సర్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








