7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌తో 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, సేల్ వివరాలు..!
Moto G67 Power 5G smartphone : మోటో G67 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 7000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. మరియు వెనుక వైపు మూడు కెమరాలను కలిగి ఉంటుంది. డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే అవకాశం ఉంది. మిలిటరీ గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ మోటో హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు, సేల్ వివరాలు.
మోటో G67 పవర్ 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీప్రెష్ రేట్, 391 ppi పిక్సల్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ రేషియో, 85.97 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోను కలిగి ఉంది. HDR10+ సపోర్టును కలిగి ఉంటుంది.

మిలిటరీ గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్ :
ఈ మోటో స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. MIL 810H మిలిటరీ గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక వైపున్న ప్యానల్ వేగాన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం ఆక్టాకోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. Adreno GPU ను కూడా జతచేసి ఉంది. ఈ ఫోన్ ర్యా్‌మ్ బూస్ట్ 4.0 ఫీచర్ ద్వారా గరిష్ఠంగా 24GB వరకు ర్యామ్‌ను పొడిగించుకోవచ్చని మోటోరోలా చెబుతోంది.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UX పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్ తోపాటు 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. గూగుల్ జెమిని ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను కూడా కలిగి ఉంది.

మూడు కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా మోటో ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2 in 1 ఫ్లిక్కర్ కెమెరాలను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను లాంచ్ అయింది.
IP64 రేటింగ్ :
ఈ హ్యాండ్‌సెట్ కెమెరాలు 30fps వద్ద ఫుల్ HD రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు. మరియు స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ క్యాప్చర్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
7000mAh బ్యాటరీ :
మోటో G67 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ 30W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 5G, బ్లూటూత్ 3.1, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, గైరోస్కోప్, SAR సెన్సర్, ఇ-కంపాస్ వంటి సెన్సర్‌లు ఉన్నాయి.
మోటో G67 పవర్ 5G ధర, సేల్ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.14999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లోనూ తర్వాత అందుబాటులోకి వస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ సేల్ నవంబర్ 12 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మోటో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ మోటో స్మార్ట్‌ఫోన్ పాంటోన్ పారాచుట్ పర్పుల్, పాంటోన్ బ్లూ కురాకో, పాంటోన్ సిలింట్రో కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








