7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, ఆకట్టుకొనే డిజైన్‌తో మోటో స్మార్ట్‌ఫోన్..!
మోటోరోలా నుంచి ఇటీవల రెండు పవర్ మోడల్స్ లాంచ్ అయ్యాయి. మోటోరోలా G86 పవర్, మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్‌లు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. G86 పవర్ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో, అదే G06 పవర్ మోడల్ ఎంట్రీ లెవల్ ధరలో విడుదల అయింది. త్వరలో స్లిమ్ మోడల్ కూడా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో G సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు మోటోరోలా తెలిపింది. మోటో G67 పవర్ పేరుతో లాంచ్ కానుంది.
మోటో G67 పవర్ ఫోన్ (Moto G67 Power Smartphone) పేరులోనూ పవర్ ఉంది. అంటే ఈ ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్ కానుంది. ఇప్పటికే వచ్చిన పవర్ మోడల్స్.. మోటో G86 పవర్ ఫోన్ 6720mAh బ్యాటరీని కలిగి ఉండగా, మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్ 7000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.

ఎప్పుడు విడుదల కానుంది :
తాజాగా మోటో G67 పవర్ ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో నవంబర్ 5 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్ మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ అందుబాటు ధరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది.
మోటో G67 పవర్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో రూ.15 వేల నుంచి రూ.20 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ పాంటోన్ బ్లూ, పాంటోన్ పారాచుట్ పర్పుల్, పాంటోన్ సిలాంట్రో కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

మోటో G67 పవర్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటో G67 పవర్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS తో అందుబాటులోకి వస్తుంది. అనంతరం ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్ పొందుతుందని మోటో చెబుతోంది.
50MP ప్రైమరీ, 32MP సెల్ఫీ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంటుంది. IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. వేగాన్ లెదర్ ఫినిష్ తో లాంచ్ కానుంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








