Home
Mobile

మోటో G71 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో

లెనోవా యాజమాన్యంలోని మోటోరోలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తన యొక్క తాజా 5G ఫోన్‌ మోటో G71 5G ను నేడు భారతదేశంలో ప్రారంభించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ హోల్-పంచ్ డిస్‌ప్లే డిజైన్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లతో పాటుగా వేగవంతమైన ఛార్జింగ్ మద్దతును కూడా అందిస్తుంది. ఇది Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతూ నవంబర్‌లో మోటో G200, మోటో G51, మోటో G41 మరియు మోటో G31లతో పాటు యూరప్‌లో మొదటగా లాంచ్ అయింది. భారతదేశంలో Redmi Note 11T 5G, Realme 8S 5G, Narzo 30 5G మరియు iQoo Z3 వంటి వాటికి గట్టి పోటీగా లభించే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G71 5G ధర మరియు లభ్యత వివరాలు

మోటో G71 5G ధర మరియు లభ్యత వివరాలు

భారతదేశంలో మోటో G71 5G స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లో లభించే ఈ ఫోన్ యొక్క ధర రూ.18,999. ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్కిటిక్ బ్లూ మరియు నెప్ట్యూన్ గ్రీన్ వంటి కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది జనవరి 19 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. నవంబర్‌లో ఈ మోటో G71 5G యూరోప్‌లో EUR 299.99 (దాదాపు రూ. 25,200) ప్రారంభ ధరతో ప్రారంభించబడింది.

మోటో G71 5G స్పెసిఫికేషన్స్

మోటో G71 5G స్పెసిఫికేషన్స్

మోటో G71 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విఆహ్యానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11లో My UXతో రన్ అవుతుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌ల) మాక్స్ విజన్ AMOLED డిస్‌ప్లేను 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 60Hz రిఫ్రెష్‌ రేటుతో ఉంటుంది. హుడ్ కింద ఈ ఫోన్ 6GB RAMతో పాటు ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoCని కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో పాటు f/2.2 అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా f/2.2 లెన్స్‌తో వస్తుంది.

మోటో G71 5G

మోటో G71 5G స్మార్ట్‌ఫోన్ 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, NFC, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఇది 33W TurboPower ఛార్జర్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో బండిల్ చేయబడిన 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఫోన్ IP52-సర్టిఫైడ్ వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌తో వస్తుంది మరియు డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది 161.19x73.87x8.49mm కొలుస్తుంది మరియు 179 గ్రాముల బరువు ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G71 5G Smartphone Released in India With Snapdragon 695 SoC: Price, Specs, Features, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X