ఫ్లిప్‌కార్ట్ లో మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు మీద భారీ ఆఫర్లు...

|

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో జరుగుతున్న బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో భాగంగా లెనోవా యాజమాన్యంలోని మోటరోలా కంపెనీకి చెందిన మోటో G8 పవర్ లైట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు అద్భుతమైన ఆఫర్లతో జరగనున్నది. మోటరోలా సంస్థ ఇటీవల తన వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క ధరను సవరించి మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. బడ్జెట్ ధరలో లభించే మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G8 పవర్ లైట్ ధర వివరాలు
 

మోటో G8 పవర్ లైట్ ధర వివరాలు

మోటరోలా యొక్క మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ రూ.8,999 బడ్జెట్ ధర వద్ద 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఒకే ఒక స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఈ ధర విభాగంలో వినియోగదారులకు ఈ స్మార్ట్‌ఫోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ కు నిజమైన సవాలు రియల్ మి నార్జో 10A, రియల్ మి C3 మరియు రెడ్‌మి 8A డ్యూయల్ వంటి ఫోన్ ల ద్వారా ఎదురుకుంటున్నది.

మోటో G8 పవర్ లైట్ సేల్ ఆఫర్స్

మోటో G8 పవర్ లైట్ సేల్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ లోని బిగ్ సేవింగ్ డేస్ అమ్మకం అమ్మకం సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు సహాయంతో కొనుగోలు చేసిన వారికి 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే నెలకు 750 రూపాయలతో ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ మీద 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

మోటో G 8 పవర్ లైట్  HD + రిజల్యూషన్ డిస్‌ప్లే

మోటో G 8 పవర్ లైట్  HD + రిజల్యూషన్ డిస్‌ప్లే

మోటరోలా యొక్క మోటో G8 పవర్ లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ యొక్క 6.5-అంగుళాల డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తితో IPS LCD మాక్స్ విజన్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఇది వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిస్‌ప్లేను HD + రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో P 35 చిప్‌సెట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో రన్ అవుతుంది. అలాగే ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 5,000mah బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది.

మోటో G 8 పవర్ లైట్ ట్రిపుల్ కెమెరా సెటప్‌
 

మోటో G 8 పవర్ లైట్ ట్రిపుల్ కెమెరా సెటప్‌

మోటో G8 పవర్ లైట్‌ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో వస్తుంది. అలాగే ఈ సెటప్‌లో ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ సెకండరీ కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియోల కోసం ఫోన్ యొక్క ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది డ్యూయల్ కెమెరా బోకె, ఫేస్ బ్యూటీ, హెచ్‌డిఆర్, గూగుల్ లెన్స్ వంటి మరిన్ని ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. ముందు మరియు వెనుక కెమెరా సెన్సార్లు రెండూ 30fps 1080p వీడియో రికార్డింగ్ కోసం మద్దతునిస్తాయి.

మోటో G8 పవర్ లైట్ 5000mAh బ్యాటరీ కనెక్టివిటీ

మోటో G8 పవర్ లైట్ 5000mAh బ్యాటరీ కనెక్టివిటీ

మోటరోలా మోటో జి 8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికతో లభిస్తుంది. ఈ కొత్త ఫోన్‌లో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 500GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 4.2, జిపిఎస్, మైక్రో యుఎస్‌బి పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ లు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ గల ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక ఛార్జ్‌లో రెండు రోజుల లైఫ్ ను అందిస్తుంది. ఇది స్ప్లాష్-రెసిస్టెంట్ ను కలిగి ఉండి 200 గ్రాముల బరువు ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Moto G8 Power Lite Sale Live on Flipkart Big Saving Days

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X