Home
Mobile

మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. డిజైన్‌, ధర సమాచారం లీక్‌.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటో నుంచి ఇటీవల మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ హ్యాండ్‌సెట్ లాంచ్‌ అయింది. అయితే త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుందని తెలుస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదలైన మోటో G84 5G స్మార్ట్‌ఫోన్‌కు తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా మోటో G85 5G (Moto G85 5G Smartphone) గురించి ఇటీవల అనేక లీక్‌లు వచ్చాయి.

అయితే ఈ హ్యాండ్‌సెట్ గురించి తాజాగా డిజైన్‌ సహా ధర వివరాలు లీక్‌ అయ్యాయి. మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన డిజైన్‌ వివరాలను Tooljunction ద్వారా షేర్‌ అయ్యాయి. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ బ్లూ కలర్‌ను కలిగి ఉంది. మరియు వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది.

Moto G85 5G smartphone design

ఈ హ్యాండ్‌ సెట్‌ OIS ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. గత మోడల్‌ కంటే కెమెరా మాడ్యుల్‌ డిజైన్‌లో మార్పులను గమనించవచ్చు. దీంతోపాటు వెనుకవైపు LED ఫ్లాష్‌ లైట్‌ యూనిట్‌ను కలిగి ఉంది.

ఈ ఫోటో ఆధారంగా మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ కుడివైపున పవర్‌, వాల్యూమ్‌ బటన్లను కలిగి ఉంది. మరియు USB-C ఛార్జింగ్‌ పోర్టును కింద భాగంలో గమనించవచ్చు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ సన్నని బెజెల్స్‌తో కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు పంచ్‌ హోల్‌ డిజైన్‌ను కూడా గమనించవచ్చు.

ఈ మోటో G85 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవల గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌లోనూ కనిపించింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు Adreno 619 GPU ప్రాసెసర్‌తో జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS తో లాంచ్ కానుందని సమాచారం.

అయితే మోటో G85 5G స్మార్ట్‌ఫోన్ ధర కూడా లీక్‌ అయింది. యూరోపియన్‌ రిటైల్‌ సైట్‌ ద్వారా ఈ ధర వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ ధర యూరప్‌లో EUR 300 (భారత కరెన్సీ ప్రకారం రూ.27,100) గా ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ధర, ఫీచర్లు ఇతర వివరాలపై మోటో ఎటువంటి ప్రకటన చేయలేదు.

**మోటోరోలా నుంచి కొన్నిరోజుల క్రితం ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కె్ట్‌లోకి లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం అయింది. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌ సహా ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ pOLED 3D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణను పొందుతుంది.

మోటోరోలా హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP LYTIA 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP ను కలిగి ఉంటుంది. 4K నాణ్యతతో 30fps తో వీడియోలను రికార్డు చేయవచ్చు.

Image Source : ToolJunction

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G85 5G smartphone design and price leaked expected to launch later this year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X