Home
Mobile

50MP సోనీ కెమెరా, 6.67 అంగుళాల డిస్‌ప్లేతో మోటోరోలా 5G స్మార్ట్‌ఫోన్‌.. విడుదల తేదీ వెల్లడి.. పూర్తి వివరాలు..

మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లోకి విడుదల కానుంది. దీనిపై సంస్థ తన సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ (Moto G85 5G Smartphone Launch Date) భారత్‌లో జులై 10న లాంచ్‌ కానుంది. విడుదల అనంతరం ఈ మోటో G85 స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లి్‌ప్‌కార్ట్‌ పేజీ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే, బ్యాటరీ, చిప్‌సెట్‌ వివరాలు వెల్లడయ్యాయి. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌ మరియు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ నిర్వహించనున్నారు.

మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఫ్లిప్‌కార్ట్ పేజీ ఆధారంగా ఈ మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ 3 రక్షణను కలిగి ఉంటుంది. మరియు 100 శాతం DCI P3 కలర్‌ Gamut కవరేజీతో వస్తుంది.

Moto G85 5G Smartphone features

ఆండ్రాయిడ్‌ 14 :
ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 6s జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీ వరకు జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ర్యామ్‌ బూస్ట్‌ ఫీచర్‌తో వస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. రెండు OS అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు.

50MP సోనీ LYT-600 కెమెరా :
ఈ మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ సెన్సార్‌తో రానుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చారు.

Moto G85 5G Smartphone features

దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ అనేక సాఫ్ట్‌వేర్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ కనెక్ట్‌, ఫ్యామిలీ స్పేస్‌, మోటో సెక్యూర్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. మరియు IP52 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా రానుంది. ఈ హ్యాండ్‌సెట్ 175 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

ఈ మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్ ద్వారా 90 గంటలపాటు సంగీతాన్ని వినొచ్చని, 38 గంటలపాటు ఫోన్ మాట్లాడుకోవచ్చని మరియు 22 గంటలపాటు వీడియో ప్లేబ్యాక్‌ సమయాన్ని పొందవచ్చని మోటోరోలా చెబుతోంది.

Moto G85 5G Smartphone features

అయితే ఈ మోటో G85 హ్యాండ్‌సెట్‌ ధర సహా ఎన్ని స్టోరేజీ వేరియంట్‌లలో విడుదల కానుందనే సమాచారం వెల్లడి కాలేదు. జులై 10 న విడుదల కానుండగా.. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ నిర్వహించనున్నాయి. త్వరలో ఈ హ్యాండ్‌సెట్‌ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ వేగాన్‌ లెదర్‌ డిజైన్‌తో కోబాల్ట్‌ బ్లూ, ఓలివ్‌ గ్రీన్‌ మరియు అర్బన్ గ్రే రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G85 5G Smartphone launch date confirmed in india specifications and features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X