Home
Mobile

మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. 50MP సోనీ కెమెరా, 6.67 అంగుళాల డిస్‌ప్లే సహా కీలక స్పెసిఫికేషన్‌లు.!

మోటోరోలా నుంచి ఇవాళ భారత్‌ మార్కెట్‌లోకి 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ (Moto G85 5g Smartphone launched) అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు 6.67 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. మరియు 5000mAh బ్యాటరీ సహా 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ను మోటోరోలా అధికారిక వెబ్‌ సైట్ Motorola.in మరియు ఫ్లిప్‌ కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల పుల్ HD+ 3D కర్వడ్‌ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2400 పిక్సల్ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్, 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌, 20:9 ఆస్పెక్ట్‌ రేషియోతో అందుబాటులో ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణను కలిగి ఉంటుంది.

Moto G85 5g Smartphone specs

ఈ మోటో G85 5G హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI ను కలిగి ఉంటుంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ Adreno 619 GPU, 12GB ర్యామ్, 256GB UFS 2,2 తో జతచేయబడింది. 24GB వరకు ర్యామ్‌ను పొడిగించే వీలుంది.

ఈ హ్యాండ్‌సెట్ రెండు సంవత్సరాల OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 34 గంటల ప్లేటైంను పొందవచ్చు.

Moto G85 5g Smartphone specs

కెమెరా విభాగం పరంగా ఈ మోటో కొత్త హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషషన్‌ (OIS) 50MP సోనీ Lytia 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంది. మరియు LED ప్లాష్‌ లైట్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ మోటో హ్యాండ్‌ సెట్‌ బ్లూటూత్‌, వైఫై 802.11, GPS, A-GPS, LTEPP, Galileo, USB-C పోర్టు వంటి ఫీచర్లను కలిగి ఉంది. యాక్సిలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌, ఈ-కంపాస్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ, సెన్సార్‌ హబ్‌, SAR సెన్సార్‌లను అమర్చారు.

Moto G85 5g Smartphone specs

ఈ హ్యాండ్‌సెట్‌ భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ మరియు ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. మరియు IP52 రేటింగ్‌తో వాటర్‌, డస్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది.

మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది. ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ను జులై 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో మోటో G85 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపు లేదా ఎక్స్చేంజీ బోనస్‌ ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా మోటో కొత్త ఫోన్‌ ప్రారంభ ధర రూ.16,999 గా ఉంటుంది. దీంతోపాటు 9 నెలలపాటు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ఓలివ్‌ గ్రీన్‌, కోబాల్ట్‌ బ్లూ, అర్బన్ గ్రే రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G85 5g Smartphone launched in india with 50MP sony Lyt 600 camera sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X