32MP సెల్ఫీ కెమెరా, 6.67 అంగుళాల 3D కర్వడ్ డిస్‌ప్లే Moto G85 5G స్మార్ట్‌ఫోన్ సేల్.. రూ.1000 తగ్గింపు..!
మోటోరోలా నుంచి జులై 10న మోటో G85 5G స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఇప్పటికే ఈ హ్యాండ్ సెట్ తొలి సేల్ పూర్తవగా.. ఇవాళ్టి నుంచి రెండో సేల్ ప్రారంభం (Moto G85 5G Smartphone Sale) అయింది. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ సహా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే, ఆలివ్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ, 6.67 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాను కలిగి ఉంది.
మోటో G85 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
మోటో G85 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల పుల్ HD+ 3D కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2400 పిక్సల్ రిజల్యూషన్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణను పొందుతుంది.

మోటో G85 5G హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ Adreno 619 GPU, 12GB ర్యామ్ మరియు 256GB UFS 2,2 తో జతచేయబడింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI ను కలిగి ఉంటుంది. రెండు సంవత్సరాల OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని సంస్థ హానీ ఇచ్చింది.
ఈ హ్యాండ్ సెట్ డ్యూయల్ కెమెరాలతో అందుబాటులో ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషషన్) సపోర్టుతో 50MP సోనీ LYTIA 600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, LED ప్లాష్ లైట్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.
మోటో G85 5G స్మార్ట్‌ఫోన్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ లాక్ ఫీచర్లను కలిగి ఉంది. IP52 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా మోటో G85 5G హ్యాండ్ సెట్ వైఫై 802.11, బ్లూటూత్, GPS, A-GPS, Galileo, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు యాక్సిలిరోమీటర్, యాంబియంట్ లైట్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, సెన్సార్ హబ్, SAR సెన్సార్ తో అందుబాటులో అంది.
మోటోరోలా G85 5G స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ప్రారంభ ధర రూ.16,999 గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








