Home
Mobile

6720mAh భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌, 50MP కెమెరాతో మోటో ఫోన్‌?.. పూర్తి వివరాలు

Moto G86 Power 5G Smartphone : మోటోరోలా నుంచి ఇటీవల భారత్‌ మార్కెట్‌లోకి మోటోరోలా ఎడ్జ్‌ 60 సిరీస్‌ ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌, మోటోరోలా ఎడ్జ్‌ 60 స్టైలస్‌, మోటోరోలా ఎడ్జ్‌ 60 ప్రో మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. రేపు భారత్ మార్కెట్‌లో మోటోరోలా Razr 60 అల్ట్రా ఫోల్డబుల్‌ ఫోన్‌ లాంచ్‌ కానుంది. అయితే త్వరలో హ్యాండ్‌సెట్‌ కూడా విడుదల కానుందని తెలుస్తోంది.

యూనిక్‌ డిజైన్‌ :
మోటోరోలా నుంచి త్వరలో మోటో G86 పవర్‌ 5G ఫోన్‌ విడుదల కానుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ రిపోర్టు ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌ కొన్ని యూనిక్‌ డిజైన్‌ మార్పులతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ప్లాస్టిక్‌, ఎకో లెదర్‌ బ్యాక్‌ ప్యానల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Moto G86 Power 5G Smartphone battery  chipset  colour variants leaked here are the features

భారీ బ్యాటరీ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మోటో G85 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ భారీ బ్యాటరీతో లాంచ్ కానుందని తెలుస్తోంది. 33W టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6,720mAh బ్యాటరీతో విడుదల కానుందని తెలుస్తోంది. ఫలితంగా సాధారణ యూజర్లకు రెండు రోజులు, హెవీ యూజర్లు రోజంతా వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని సమాచారం.

డిస్‌ప్లే పరంగా ఈ మోటో హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల (2712 x 1229 పిక్సల్స్‌) pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఇతర మోడల్స్‌తో పోలిస్తే కాస్త ఎక్కువ థిక్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. భారీ బ్యాటరీయే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఫోన్‌ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i తో ప్రొటెక్షన్‌ పొందుతుందని తెలుస్తోంది.

శక్తివంతమైన చిప్‌సెట్‌! :
మోటో G85 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS తో లాంచ్‌ కానుంది. 8GB/12GB ర్యామ్, 128GB/256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT 600 కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 8MP మ్యాక్రో కెమెరాతోపాటు ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాతో లాంచ్‌ కానుందని సమాచారం.

బెస్ట్‌ వాటర్ రెసిస్టెంట్‌ :
ఈ మోటో ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ రెండు ఫీచర్‌లతో ఎక్కువ రోజులపాటు మన్నిక రావడంతోపాటు డస్ట్ మరియు వాటర్‌ నుంచి డ్యామేజీ కాకుండా ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

అయితే ఈ హ్యాండ్‌సెట్ ఎప్పుడు లాంచ్‌ కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. ప్రస్తుతం మోటోరోలా సంస్థ మోటో G86 పేరుతో స్టాండర్డ్‌ మోడల్‌ను కూడా లాంచ్‌ చేయనుంది. అయితే ఈ రెండు ఒకేసారి విడుదల కానున్నాయా లేదా వేర్వేరు సమయాల్లో అందుబాటులోకి వస్తాయా తెలియాల్సి ఉంది. ఈ మోటో G86 పవర్ ఫోన్‌ కాస్మిక్‌ స్కై, గోల్డెన్‌ సైప్రస్‌, స్పిల్‌బౌండ్‌, Chrysanthemum కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G86 Power 5G Smartphone battery, chipset, colour variants leaked here are the features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X