Home
Mobile

6720mAh భారీ బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, వాటర్‌ ఫ్రూఫ్, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌..!

Moto G86 Power 5G Smartphone : మోటోరోలా నుంచి మరో బడ్జెట్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఇటీవలే మోటో G96 హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా మోటో G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. ఈ ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. మరియు వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ ను కలిగి ఉంది. ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల పూర్తి వివరాలు.

మోటో G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల సూపర్‌ HD అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1220 x 2712 పిక్సల్స్ రిజల్యూషన్‌, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Moto G86 power 5G Smartphone launch news

ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే HDR10+, Low Motion Blur, Low Blue Light SGS సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ మోటో హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ మోటో స్మార్ట్‌ఫోన్ 4nm ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI (Out of the box) పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ (మాక్రో మోడ్‌ను సపోర్టు చేస్తుంది) 3 ఇన్ 1 ఫ్లిక్కర్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు.

Moto G86 power 5G Smartphone launch news

భారీ బ్యాటరీ :
ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ 33W టర్బోపవర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6720mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ కోసం డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సర్టిఫికేషన్‌తో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌ను కలిగి ఉంది. 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై 6, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

Take a Poll

మోటో G86 పవర్ 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
మోటో G86 పవర్ 5G స్మా్ర్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. ఈ ఫోన్‌ సేల్‌ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ స్పెల్‌బౌండ్‌, కాస్మిక్‌ స్కై, గోల్డెన్‌ సైప్రెస్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G86 5G Smartphone with 6720mAh battery, 50MP camera launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X