రూ.15 వేల ధర రేంజ్‌లో 50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, 6720mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్!
Flipkart Republic Day Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 లో భాగంగా ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్ లు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో భాగంగా HDFC బ్యాంకు క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో మోటోరోలా G86 పవర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6720mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది.
మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ (Moto G86 Power 5G Smartphone) ప్రస్తుతం మోటోరోలా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.16999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

సుమారుగా రూ.15 వేల ధర రేంజ్‌లోనే :
దీంతోపాటు ఈ సేల్ లో భాగంగా HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. అంటే సుమారుగా మరో రూ.1700 వరకు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.15 వేల ధర రేంజ్ లోనే అందుబాటులోకి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ గోల్డెన్ సైప్రెస్, కాస్మిక్ స్కై, స్పెల్ బౌండ్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
అమోలెడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ :
మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల సూపర్ HD అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను పొందుతోంది. HDR10+, Low Motion Blur, Low Blue Light SGS సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ హ్యాండ్‌సెట్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్, 3 ఇన్ 1 ఫ్లిక్కర్ లెన్స్‌లను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
భారీ బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 33W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్టుతో 6720mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. డాల్బీ అట్మాస్, Hi-Res ఆడియో సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది.


Click it and Unblock the Notifications








