Home
Mobile

బెస్ట్‌ వాటర్‌ ప్రూఫ్‌, భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌తో మోటో 5G ఫోన్‌.. ఇవాళ్టి నుంచే సేల్‌..!

Moto G86 Power Smartphone Sale : మోటోరోలా ఇండియా ఇటీవల కాలంలో కొన్ని రోజుల గ్యాప్‌లోనే బడ్జెట్‌ రేంజ్‌ లో రెండు స్మార్ట్‌ఫోన్‌ లను లాంచ్‌ చేసింది. మోటోరోలా G96 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఇప్పటికే ప్రారంభం కాగా.. మోటోరోలా G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ ఏకంగా 6720mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్‌ పూర్తి వివరాలు.

ధర, సేల్ వివరాలు :
మోటో G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ సింగిల్‌ స్టోరేజీ వేరియంట్‌ లోనే భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

Moto G86 Power 5G Smartphone with 6720mAh battery sale to start from today via flipkart

మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ గోల్డెన్‌ సైప్రెస్‌, కాస్మిక్‌ స్కై, స్పెల్‌ బౌండ్‌ కలర్‌ వేరియంట్స్‌ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ జరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను కూడా పొందవచ్చు.

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
మోటో G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్ 4nm ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది.

Moto G86 Power 5G Smartphone with 6720mAh battery sale to start from today via flipkart

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల సూపర్‌ HD అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ డిస్‌ప్లే HDR10+, Low Motion Blur, Low Blue Light SGS సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 3 ఇన్ 1 ఫ్లిక్కర్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ 33W టర్బోపవర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6720mAh బ్యాటరీని కలిగి ఉంది.

Moto G86 Power 5G Smartphone with 6720mAh battery sale to start from today via flipkart

IP68 + IP69 రేటింగ్‌ :
మోటో G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సర్టిఫికేషన్‌తో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.4, Wi-Fi 6, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G86 Power 5G Smartphone with 6720mAh battery sale to start from today via flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X