Home
Mobile

6720mAh భారీ బ్యాటరీ, వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌..!

Moto G86 Power Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి ఇటీవల మోటో G96 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. త్వరలో మరో హ్యాండ్‌సెట్‌ విడుదల కానుంది. మోటో G86 పవర్‌ పేరుతో అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ ఫోన్‌ విడుదల తేదీతోపాటు కీలక స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది? :
మోటో G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ జులై 30 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌ మార్కెట్‌ లో విడుదల కానుంది. విడుదల అనంతరం ఈ హ్యాండ్‌సెట్‌ మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్ (Motorola.in), అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది.

Moto G86 Power launch date

కలర్‌ వేరియంట్స్ :
ఈ మోటో G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.20000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌ పాంటోన్‌ స్పెల్‌బౌండ్, పాంటోన్‌ గోల్డెన్ సైప్రెస్‌, పాంటోన్ కాస్మిక్‌ స్కై వంటి మూడు కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది. మోటోరోలా ఈ ఫోన్‌ కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది.

మోటో G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల 1.5K ఫ్లాట్‌ pOLED డిస్‌ప్లేను కలిగిఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. ఈ ‌స్మార్ట్‌ఫోన్‌ కార్నింగ్ గొరిల్లా 7i రక్షణ పొందుతుంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్‌ స్టైలిష్‌ వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ తో కూడిన ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

Moto G86 Power launch date

మీడియాటెక్‌ చిప్‌సెట్‌, భారీ బ్యాటరీ :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని మోటోరోలా తెలిపింది. మరియు 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలిపింది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6720mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది.

50MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా :
ఈ ఫోన్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంటుంది. ఈ ఫోన్‌ వెనుక, ముందు కెమెరాల ద్వారా 30fps వద్ద 4K వీడియో రికార్డు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంటుంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ఫ్యామిలీ స్పేస్‌, స్మార్ట్‌ కనెక్ట్‌, మోటో గెశ్చర్స్‌, వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G86 Power Smartphone launch date and specifications revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X