మోటోరోలా నుంచి రూ.20 వేల ధర రేంజ్‌లో 5G స్మార్ట్‌ఫోన్.. 50MP సోనీ కెమెరా, 5500mAh బ్యాటరీ..?
Moto M96 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి త్వరలో మరో హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. ఇటీవలే ఈ హ్యాండ్‌సెట్ కు సంబంధించిన వివరాలను టీజ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ విడుదల వివరాలను వెల్లడించింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ చిప్‌సెట్, డిస్‌ప్లే, కెమెరా వివరాలను వెల్లడించింది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఎప్పుడు విడుదల కానుంది? :
మోటో G96 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో జులై 9 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్ పింక్, గ్రీన్, లైట్ బ్లూ వంటి మూడు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ఆధారంగా మోటో G96 5G స్మార్ట్‌ఫోన్ అనేక వివరాలు వెల్లడయ్యాయి.

డిస్‌ప్లే అంచనా వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ వేగాన్ లెదర్ బ్యాక్ ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 144Hz pOLED కర్వడ్ డిస్‌ప్లేతో 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 10 బిట్ కలర్ డెప్త్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ మోటో హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.20 వేల నుంచి రూ.22 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Lights. Camera. Your moment.
— Motorola India (@motorolaindia) June 30, 2025
Stay tuned. #AllEyesOnYou#Motorola #ComingSoon #MotoG96 #5G pic.twitter.com/UwtzZD2ZtG
సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ మోటో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ) సపోర్టుతో 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ (మ్యాక్రో లైన్స్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు), సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
బ్యాటరీ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 68W ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ మెరుగైన ఆడియో అనుభూతి కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ ఆధారంగా వెల్లడయింది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
మోటోరోరా నుంచి ఇటీవల ఎడ్జ్ 60 సిరీస్ విడుదల అయింది. ఇందులో ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 స్టైలస్, ఎడ్జ్ 60 ప్రో, ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నాలుగు ఫోన్‌లు రూ.20 వేల నుంచి రూ.30 వేల ధర రేంజ్‌లో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








