Home
Mobile

బడ్జెట్‌ రేంజ్‌లో మంచి ఫోన్‌ కోసం చూస్తున్నారా.. ఇవాళ విడుదల అయిన స్మార్ట్‌ఫోన్‌ మీకు బెస్ట్‌ ఆప్షన్‌ కావచ్చు!

Moto G96 5G Smartphone : మోటోరోలా నుంచి భారత్ మార్కెట్‌లో ఇటీవల అనేక స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. మోటోరోలా ఎడ్జ్‌ 60 సిరీస్‌తోపాటు మోటోరోలా Razr మోడల్స్ కూడా లాంచ్‌ చేసింది. అయితే తాజాగా మోటో G96 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను రూ.20 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను కలిగి ఉంది.

మోటో G96 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల ఫుల్‌ HD+ 10 bit 3D కర్వడ్‌ pOLED డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 144Hz రీప్రెష్‌ రేట్, 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ వేగాన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది.

Moto G96 5G Smartphone launch telugu news

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI Skin పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT 700c ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఆటోఫోకస్‌, మ్యాక్రో విజన్ సపోర్టు, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు f/2.2 అపేచర్‌, ఫిక్సడ్‌ ఫోకస్‌ సపోర్టుతో 32MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ AI Photo Enhancement ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.

Moto G96 5G Smartphone launch telugu news

5500mAh బ్యాటరీ ఫోన్‌ :
మోటో స్మార్ట్‌ఫోన్‌ 33W టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ వాటర్‌ టచ్‌ సపోర్టును కలిగి ఉంటుంది.

Take a Poll

కనెక్టివిటీ పరంగా ఈ మోటో G96 5G స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G, వైఫై, బ్లూటూత్‌ 5.2, NFC, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

మోటోరోలా G96 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
మోటోరోలా G96 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది.

ఈ ఫోన్ సేల్‌ జులై 16 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆష్లీ బ్లూ, డ్రెస్టెన్ బ్లూ, గ్రీనర్‌ పాశ్చర్స్‌, కాట్లేయా ఆర్చిడ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G96 5G Smartphone launched with 50MP OIS Camera 5500mAh Display at rs17999 Price in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X