8GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 5500mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా 5G ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
Moto G96 5G Smartphone Sale : భారత్ మార్కెట్లో మోటోరోలా నుంచి ఇప్పటి వరకు అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఎడ్జ్ 60 సిరిస్‌తోపాటు Razr మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల రూ.18 వేల ధర రేంజ్‌లో మోటోరోలా నుంచి స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. మోటో G96 5G పేరుతో విడుదల అయింది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను కలిగి ఉంది.
ఫోన్ ప్రారంభ ధర రూ.17999 :
మోటోరోలా G96 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది.

అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ మోటో ఫోన్ గ్రీనర్ పాశ్చర్స్, కాట్లేయా ఆర్చిడ్, ఆష్లీ బ్లూ, డ్రెస్టెన్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
మోటో G96 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI Skin పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
వేగాన్ లెదర్ ఫినిష్ :
ఈ మోటో హ్యాండ్‌సెట్ 144Hz రీప్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ 10 bit 3D కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వేగాన్ లెదర్ ఫినిష్‌తో అందుబాటులోకి వచ్చింది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 700c ప్రైమరీ కెమెరా, ఆటోఫోకస్, మ్యాక్రో విజన్ సపోర్టుతో 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంది. ఫిక్సడ్ ఫోకస్ సపోర్టుతో 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కెమెరాల ద్వారా 4K వీడియో రికార్డింగ్‌ను కలిగి ఉంది.
మోటో G96 5G స్మార్ట్‌ఫోన్ 33W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వాటర్ టచ్ సపోర్టును కలిగి ఉంది. అంటే తడి చేతులతోనూ ఫోన్‌ను నియంత్రించవ్చచు.
ఈ హ్యాండ్‌సెట్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. మరియు AI Photo Enhancement ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, WiFi, బ్లూటూత్ 5.2, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








