Home
Mobile

రూ.2 వేల డిస్కౌంట్‌.. 50MP సోనీ కెమెరా, 5500mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ 5G స్మార్ట్‌ఫోన్‌!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ మోటోరోలా ఈ సంవత్సరం జులైలో మోటో G96 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Moto G96 5G smartphone) విడుదల చేసింది. బడ్జెట్‌ రేంజ్‌ లో ఈ హ్యాండ్‌సెట్‌ ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ 8GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 50MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్‌ అందిస్తోంది.

రూ.2 వేల డిస్కౌంట్‌ :
విడుదల సమయంలో మోటో G96 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19,999 గా ఉండేది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌లపై రూ.2 వేల డిస్కౌంట్‌ను ప్రకటించింది. సెప్టెంబర్‌ 23 నుంచి ప్రారంభం అయ్యే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2025 లో ఈ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Moto G96 5G smartphone will be available with Rs2000 pricecut on flipkart soon news in telugu

రూ.15999 ధరకే :
దీంతో రూ.15999, రూ.17999 ధరకే ఈ ఫోన్‌ ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫోన్‌ విడుదల అయిన కేవలం మూడు నెలల్లోనే రూ.2 వేల డిస్కౌంట్ తో అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ గ్రీనర్‌ పాశ్చర్స్‌, కాట్లేయా ఆర్చిడ్‌, ఆష్లీ బ్లూ, డ్రెస్టెన్ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

ఫుల్‌ HD+ 3D కర్వడ్‌ డిస్‌ప్లే :
మోటో G96 5G స్మార్ట్‌ఫోన్ వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌తో అందుబాటులో ఉంది. 6.67 అంగుళాల FHD+ 3D కర్వడ్‌ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీప్రెష్‌ రేట్‌, 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌, 5500mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. 33W టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

50MP సోనీ OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP సోనీ LYT 700C కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.

IP68 రేటింగ్‌ :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్‌ 5.2, NFC, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Moto G96 5G smartphone will be available with Rs2000 pricecut on flipkart soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X