4జీబి ర్యామ్‌తో Moto M
ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.
కొద్ది రోజుల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన మోటరోలా లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్ Moto M ఇప్పుడు 4జీబి ర్యామ్ వేరియంట్‌లో దొరుకుతోంది. 4జీబి ర్యామ్ + 64జీబి వేరియంట్ ధర రూ.17,999. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఈ ఫోన్ కొనుగోలు పై పలు ప్రారంభ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందుబాటులో ఉంచింది.
Read More : అడల్డ్ వెబ్‌సైట్స్ చూస్తున్నారా, మీ ఫేస్‌బుక్ అకౌంట్‌తో జాగ్రత్త

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్
మోటరోలా మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే పై భాగంలో ఏర్పాటు 2.5డి కర్వుడ్ గ్లాస్ ఆకట్టుకుంటుంది. చూపుడు వేలుకు అందే విధంగా ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌ను ఏర్పాటు చేసారు.

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి..
2GHz ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన మీడియాటెక్ హీలియో పీ15 చిప్‌సెట్ పై మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌తో పాటుగా వచ్చే Mali T860 MP2 GPU ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

4జీబి ర్యామ్ సపోర్ట్
4జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీనికి కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

16 మెగాపిక్సెల్ కెమెరా...
మోటరోలా మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. పీడీఏఎఫ్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 85 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో చూడొచ్చు.

రోజంతా బ్యాటరీ
రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేసే విధంగా శక్తివంతమైన 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ లో ఏర్పాటు చేయటం జరిగింది. రెండు డాల్బీ అటామస్ స్టీరియో స్పీకర్లను కూడా లెనోవో ఈ ఫోన్‌లో అమర్చింది.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన లెనోవో వైబ్ యూజర్ ఇంటర్ ఫేస్ పై మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. 4జీ వోల్ట్, జీపీఎస్, బ్లుటూత్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








