64జీబి మెమరీ వేరియంట్‌లో ‘మోటో ఎక్స్’

మోటరోలా నుంచి కొద్ది నెలల క్రితం విడుదలైన సంచలనాత్మక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు 64జీబి మెమరీ వేరియంట్‌లో లభ్యమవుతోంది. ఇప్పటి వరకు ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో మాత్రమే లభ్యమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో జూన్8 నుంచి ఈ వేరియంట్ లభ్యంకానుంది. ధర 449 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.26,535). మోటో ఎక్స్ 64 జీబి వేరియంట్ ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. మోటో ఎక్స్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....
సింగిల్ సిమ్, 4.7 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమెరీ, 10 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications